Breaking News

షహర్‌ కా షాన్‌ షేర్వానీ

Published on Thu, 12/26/2024 - 12:41

నవాబుల కాలం నుంచి ఇప్పటి దాకా షేర్వానీకి ఏమాత్రం క్రేజ్‌ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు రాజ కుటుంబీకులు, సంపన్నవర్గాలకే షేర్వానీ పరిమితమయ్యేది. రానురాను పేద, ధనిక అందరూ షేర్వానీ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాల్లో కుటుంబ సభ్యులంతా చిన్నాపెద్దా తేడా లేకుండా షేర్వానీ ధరించాల్సిందే.. బ్రాండెడ్‌ దుస్తులు మార్కెట్‌ను రాజ్యమేలుతున్నా.. రాజుల కాలం నాటి షేర్వానీలు పండగలు, శుభకార్యాలకు సరికొత్త శోభను తీసుకువస్తున్నాయి. ఇదే ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది.  



అభిరుచులకు అనుగుణంగా షేర్వానీ డిజైన్లలోనూ మార్పులొచ్చాయి. రాకుమారులు.. సినీహీరోలు.. రాజకీయ నాయకులు ఇలా సెలబ్రెటీలంతా భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా షేర్వానీని ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన సంస్కృతే కాదు.. పాశ్చాత్య డిజైన్ల సమ్మేళనంగా సరికొత్త షేర్వానీలు మార్కెట్‌లో ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం నిజాం నవాబులు, ముస్లిం, మార్వాడీ సమాజంలోనే షేర్వానీ ఆహార్యం కనిపించేంది. ఇప్పుడు ఈ ఫ్యాషన్‌ అందరి ఒంటి మీదకు చేరింది. మొదట్లో కేవలం పెళ్లి కుమారుడే షేర్వానీతో ఊరేగేవాడు.. ఇప్పుడు వరుడే కాదు.. పెళ్లి బరాత్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ డ్రెస్‌ వేర్‌ను వాడటం పరిపాటిగా మారింది. విభిన్న రకాలతో షేర్వానీలతో బరాత్‌కే కొత్త అందం వస్తుందనే ప్రచారంతో వివాహంలో షేర్వానీ డ్రెస్‌ కోడ్‌గా మారింది.  

షేర్వానీ అంటే మక్కువ ఇండో వెస్టన్‌ 
డిజైన్స్‌తో వినియోగదారులకు నచ్చే విధంగా షేర్వానీలు తయారు చేస్తున్నాం. నేటి యువత మాములు డిజైన్‌ షేర్వానీలకు కాకుండా స్టైయిలి‹Ùగా కనబడటానికి కొత్త డిజైన్స్‌ను ఫాలో అవుతున్నారు. మారుతున్న డిజైన్స్‌కు అనుగుణంగా మా వద్ద షేర్వానీలు తయారవుతాయి. ప్రస్తుతం అన్ని మతాలు, వర్గాల వారు వీటిని ధరిస్తున్నారు. వారి వారి సంప్రదాయల డిజైన్లలో తయారు చేస్తున్నాం. షేర్మానీలు ధరించి శుభకార్యాలకు వెళితే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాలు పెళ్లిళ్లు విందుల్లో షేర్వాణి ధరించి వెళ్లే వారివైపే అందరి చూపు ఉంటుంది. నేటి యువత వీటిని ధరించడానికి మక్కువ చూపుతున్నారు. 
– ఇబ్రాహీమ్‌ బుఖారీ, జహాపనా డిజైనర్స్‌ వ్యవస్థాపకుడు  

బనారస్‌ పట్టుతో తయారీ 
షేర్వానీల తయారీలో బనారస్‌ పట్టుదే పైచేయి. ఈ పట్టుతోనే వీటిని ఉత్పత్తి చేసే అవకాశమున్నందున.. ఫ్యాషన్‌లో బనారస్‌ షేర్వానీలదే హవా. పురుషులు వ్రస్తాలలో పట్టుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం షేర్వానీలలో మాత్రం ఈ పట్టుకే పట్టం కడుతున్నారు. ఇలా వస్త్ర నాణ్యతకు అనుగుణంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి. రూ.2వేల నుంచి రూ.2 లక్షల వరకు షేర్వానీలు లభ్యమవుతున్నాయంటే వీటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. వీటికి ఉన్న ఆదరణ దష్ట్యా షేర్వానీ ప్రియులు కస్టమైజ్డ్‌ డిజైన్లు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డిజైనర్లు సైతం పుట్టుకొచ్చారు. నగరంలో బుఖారీ ఫ్యామిలీ జహాపనా డిజైనర్స్‌ పేరుతో షేర్వానీ రంగంలో విప్లం తీసుకొచి్చంది. యుత్‌కు నచ్చే స్టయిల్స్‌తో పాటు అన్ని కట్స్‌లో షేర్వానీలు తయారవుతున్నాయి.  

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు