Breaking News

గ్రీన్‌ ఆర్మీ

Published on Sat, 01/04/2025 - 04:54

ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్‌ గ్యాంగ్‌’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్‌ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్‌ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.

వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్‌ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్‌ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్‌ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్‌ కీ బాత్‌’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్‌ ఆర్మీలో కొత్త జోష్‌ వచ్చింది.

వారణాసి చుట్టుపక్కల
గ్రీన్‌ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్‌ ఆర్మీ పేరు వినపడసాగింది.

270 పల్లెల్లో...
వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్‌ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్‌కైతే స్థానమే లేదు. గ్రీన్‌ ఆర్మీతో స్థానిక పోలీస్‌ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్‌ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్‌ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.

ఆడపిల్లే అదృష్టం
కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్‌ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి.  అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్‌ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. 
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)