Mahakumbh Mela 2025: భారత్‌ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి

Published on Mon, 01/27/2025 - 17:27

144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ ఆశ్చర్యకర ఘటనలకు, అద్భుతాలకు నిలయంగా మారింది. ఆ‍ధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎందరెందరో దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. అందులో ఎందరో ఉన్నత విద్యావంతులు బాబాలుగా మారిన వారిని వెలుగులోకి తెచ్చింది. అందరివీ వేరు దారులైన అంతా కలిసేది ఈఆధ్యాత్మిక సాగరంలోనే అని చాటిచెబుతోంది. ఈ మహాకుంభమేళలో రెండు వేర్వురు దేశాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ఒక్కటయ్యేందుకు వేదికగా మారింది. వాళ్లెవరు..? మన హిందూ వివాహ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు..? తదితరాల గురించి తెలుసుకుందామా..!.

మన భారత్‌కి చెందిన యువకుడి గ్రీకు అమ్మాయిని పెళ్లాడింది. అది కూడా మన హిందూ వైవాహిక సాంప్రదాయంలోనే వివాహం చేసుకోవడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. గ్రీకు యువతి పెన్‌లోప్‌ భారత్‌కు చెందిన సిద్ధార్థ్‌ అనే యువకుడిని వివాహం చేసుకుంది. అయితే వారిద్దరూ మన హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని భావించి అత్యంత పుణ్యప్రదమైన ప్రయాగ్‌రాజ్‌లోని ఈ మహాకుంభమేళాని ఎంచుకున్నట్లు తెలిపారు ఇరువురు. 

ఇక గ్రీకు యువతి పెన్‌లోప్‌ కొన్నేళ్ల క్రితం సనాతనధర్మం  సంప్రదాయాలను అవలంభిస్తోందని, శివుని భక్తురాలిగా మారిందని జూనా అఖారాకు చెందిన దర్వి చెప్పారు. ఇక సిద్ధార్థుడు కూడా మా భక్తుడే, ఆయన యోగాను వ్యాప్తి చేయడానికి, సనాతన సేవ చేయడానికి వివిధ విదేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అలాగే వారి వారి వివాహ క్రతువు జూనా అఖారాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి యతీంద్రానంద గిరి ఆధ్వర్యంలో జరిగింది. 

ఇక కన్యాదాన ప్రక్రియ వధువు తల్లి, ఆమె బంధువులు కలిసి నిర్వహించారు. ఈ పుణ్యప్రదమైన సమయంలోనే పెళ్లిచేసుకోవాలని ప్రగాఢంగా కోరుకున్నామని ఆ జంట తెలిపింది. ఇక పెన్‌లోప్‌ కూడా కొత్త సంస్కృతిని స్వీకరించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. తానెప్పుడు భారతీయ వివాహం చూడలేదన్నారు. 

అందువల్ల తనకు ప్రతీది కొత్తగా ఉందన్నారు. ఈ జంట ఈ మహాకుంభమేళ అయ్యే వరకు ఇక్కడే ఉండి స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. అలాగే రానున్న మౌని అమావాస్య జనవరి 29 పవిత్ర స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. గ్రీకు యువతి పెన్‌లోప్‌ తల్లి కూడా తాము కూడా ఈ పుణ్యకార్యక్రమాన్ని మిస్‌ చేసుకోవాలని అనుకోవట్లేదని అన్నారు. ఈ మహాకుంభ మేళ ప్రారంభం నుంచి ఇక్కడే ఉన్నామని, పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండేలా ప్లాన్‌ చేసుకుంటన్నట్లు తెలిపారు.

(చదవండి: ఐఐటీ గ్రాడ్యుయేట్‌, టాటా స్టీల్‌ కంపెనీలో ఉద్యోగం..కట్‌చేస్తే ఇవాళ..!)

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)