Breaking News

నేడు ఫినాలే..బ్యూటీ కిరీటం ఎవరికి?

Published on Sat, 05/31/2025 - 06:02

అందం అంటే ఆత్మవిశ్వాసం.. అందం అంటే ఓ సామాజిక బాధ్యత..  అందం అంటే సాధికారత..  అందం అంటే ఎమోషనల్‌ బ్యాలెన్స్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌.. అనే అందమైన నిర్వచనాలను స్థిరపరుస్తూ సాగుతున్న మిస్‌ వరల్డ్‌  పోటీలకు ఈసారి హైదరాబాద్‌ వేదికైంది! ఈ  పోటీలు ఫైనల్‌కి వచ్చాయి.  మిస్‌ వరల్డ్‌ కిరీటం ఎవరికి దక్కనుందో తేలేది నేడే! నూటఎనిమిది దేశాలకు చెందిన సుందరీమణులు  పోటీ పడుతున్న ఆ బ్యూటీ  పాజెంట్‌ ఫైనల్‌ ఎలా ఉండబోతోంది, మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన సుందరి ఏడాదంతా ఏం చేస్తుంది లాంటివి ఆసక్తిని రేకెత్తిస్తాయి.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో సాయంత్రం ఆరున్నరకు మొదలవనున్న మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే వేడుకను మిస్‌ వరల్డ్‌ 2016 స్టెఫనీ డెల్‌ బాయే ( Stephanie del valle), యాంకర్, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ సచిన్‌ కుంభార్‌.. ఇద్దరూ కలిసి హోస్ట్‌ చేస్తున్నారు.

ఎంపిక ఇలా.. 
ముందుగా 108 దేశాల సుందరీమణులు వేదిక మీదికి వస్తారు. అమెరికా– కరిబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా– ఓషియానియాల నుంచి ఖండానికి పది మంది చొప్పున మొత్తం నలభై మందిని క్వార్టర్‌ ఫైనల్‌కిసెలెక్ట్‌ చేస్తారు. అయితే ఇప్పటికే రకరకాల  పోటీల్లో ఈ నాలుగు ఖండాల నుంచి పద్దెనిమిది మంది క్వార్టర్‌ ఫైనల్‌కి చేరుకున్నారు. మిగిలినవారిని పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్‌ చేసిన జ్యూరీ ఈ రోజు వాళ్ల పేర్లను ప్రకటించి వేదిక మీదికి ఆహ్వానిస్తుంది. ఈ నలభై మందిలోంచి ప్రతి ఖండానికి టాప్‌ ఫైవ్‌ చొప్పున, మళ్లీ అందులోంచి ప్రతి ఖండానికి టాప్‌ 2 లెక్కన సెలెక్ట్‌ చేస్తారు.

ఫైనల్‌గా.. 
ఫైనల్‌రౌండ్‌ వచ్చేసరికి మొత్తం నలుగురు మాత్రమే మిగులుతారు. ఈ నలుగురిని జ్యూరీ ఓ ప్రశ్న అడుగుతుంది. ఆ జవాబును బట్టి మిస్‌ వరల్డ్‌ను ఎంపిక చేస్తారు. విజేతకు కిందటేడు మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని తొడుగుతుంది. జ్యూరీలో నటుడు సోనూ సూద్, సుధారెడ్డి, మిస్‌ ఇంగ్లండ్‌ 2014 డాక్టర్‌ కెరీనా టరెల్, మిస్‌ వరల్డ్‌ చైర్‌పర్సన్‌ జూలియా మోర్లే సభ్యులుగా ఉంటారు.

గెలిచిన తర్వాత.. 
మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ విజేత తన దేశం తరపున ప్రపంచవ్యాప్త సాంస్కృతిక కార్యక్రమాలు, అధికారిక వేడుకలు, సంబరాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పలు చారిటీ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్‌లో  పాల్గొంటుంది. మిస్‌ వరల్డ్‌ సంస్థ తరపున ప్రపంచ యాత్ర చేస్తూ ఆ సంస్థ లక్ష్యాలను ప్రచారం చేస్తుంది. అక్షరాస్యత, పలు 
సామాజిక అంశాల అవగాహన కార్యక్రమాల్లో  పాల్గొంటుంది.

ఇంకా... 
→ మిస్‌ వరల్డ్‌ విజేతకు తొడిగే అందాల కిరీటం ధర రూ. 85 లక్షల పైచిలుకే! 18 క్యారట్ల గోల్డ్‌తో చేసిన ఆ కిరీటం మధ్యలో 62. 83 క్యారట్ల డైమండ్‌ చుట్టూ 1770 చిన్న చిన్న డైమండ్స్‌ ΄÷దిగి ఉంటాయి. వాటన్నిటి బరువు 175.49 క్యారట్లుంటాయి. దీన్ని ఆ విజేత ముఖ్యమైన ఈవెంట్స్‌లో మాత్రమే ధరిస్తుంది. ప్రపంచ యాత్రలో అసలైన కిరీటాన్ని పెట్టుకోదు. మిస్‌ వరల్డ్‌ విజయానికి చిహ్నంగా విజేతకు రెప్లికా క్రౌన్‌ను ఇస్తారు. అసలు కిరీటం మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ దగ్గరే ఉంటుంది. ఈ  పోటీలకు వయోపరిమితి 17 ఏళ్ల నుంచి 27 ఏళ్లు. 

→ టర్మ్‌ అవకముందే మిస్‌ వరల్డ్‌ హోదాకు రాజీనామా చేసిన తొలి మిస్‌ వరల్డ్‌ 1974 సంవత్సర విజేత హెలెన్‌ మోర్గన్‌. టైటిల్‌ గెలిచిన నాలుగు రోజులకు ఆమె ఏడాదిన్నర బిడ్డకు తల్లి అని తెలిసిందట. మిస్‌ వరల్డ్‌  పోటీల్లో అవివాహితలు మాత్రమే  పాల్గొనాలనే నియమాన్ని ఉల్లంఘించినందువల్ల ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. 

→ అమెరికా – వియత్నాం యుద్ధంలో అప్పటి మన ప్రభుత్వం వియత్నాం పక్షాన నిలబడింది. దీనికి విరుద్ధంగా మన తొలి మిస్ట్‌ వరల్డ్‌ రీటా ఫారియా అమెరికన్‌ ఎంటర్‌టైనర్‌ బాబ్‌ హోప్‌తో కలిసి అమెరికా సైనికులను ఎంటర్‌టైన్‌ చేసిందని ఆమె చర్య పట్ల అప్పుడు మన ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.  

→ మిస్‌ వరల్డ్‌  పోటీలు మొదలైన నాటి (1951) నుంచి ఈరోజు దాకా మన దేశం ఆరుసార్లు కిరీటాన్ని గెలిచి రికార్డ్‌ సృష్టించింది. 

→ విజేతల్లో ఐశ్వర్యా రాయ్‌ను మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ మిస్‌ వరల్డ్‌గా చెబుతుంటారు. 

→ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనలకు నో చెప్పిన తొలి మిస్‌ వరల్డ్‌గా డయానా హెడెన్‌ (మిస్‌ వరల్డ్‌ 1997)ను ప్రస్తావిస్తారు. ‘నా ఒంటి రంగు పట్ల నాకెలాంటి రిగ్రెట్స్‌ లేవు. ఛాయ తక్కువగా ఉండటాన్ని నేను ఆత్మన్యూనతగా ఎప్పుడూ భావించలేదు. ఆ స్కిన్‌టోన్‌తోనే నేను మిస్‌ వరల్డ్‌గా గెలిచాను. నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం. కాబట్టి దాన్నే ప్రమోట్‌ చేస్తాను ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ని కాదు’ అని చెప్పింది డయానా. 

→ అందాల  పోటీల్లో చమత్కారం, సునిశిత దృష్టి గల జవాబులకు ప్రియాంక చోప్రాపెట్టింది పేరుగా ఖ్యాతినార్జించింది. 

– సరస్వతి రమ
ఫొటో: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)