కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుని స్నానం చేస్తున్నారా..? పాపం ఆ మహిళ..

Published on Wed, 04/22/2026 - 13:19

చాలామంది కళ్లద్దాల కంటే కాంటాక్ట్‌ లెన్స్‌లే ధరిస్తుంటారు. ఎందుకంటే కళ్లజోడు అయితే ముఖంపై ఆనవాలు పడిపోవడం, లేది ఇబ్బందిగా ఉంటుంది. అదే కాంటక్ట్‌ లెన్స్‌లు కంఫర్ట్‌ తోపాటు చూపు మెరుగ్గా ఉంటుంది. అదే టైంలో ముఖానికి సరికొత్త లుక్‌ని అందిస్తుంది కూడా. అందుకే చాలామంది కాంటాక్ట్‌ లెన్స్‌ ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఇక్కడ ఈ యువత కూడా కాంటాక్స్‌ లెన్సులు ఉపయోగించేది. అయితే వాటిని ఉపయోగించే విషయంలో చూపిన చిన్న అజాగ్రత్త ఆమె కంటి చూపునే కోల్పోయే పరిస్థితికి దారితీసింది. 

అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన 20 ఏళ్ల గ్రేస్ జేమిసన్‌ కాంటాక్ట్‌ లెన్స్‌ ధరించే ప్రతి ఒక్కరికి ఇదొక పాఠంగా, హెచ్చరికగా ఉంటుందంటూ తన కథను షేర్‌ చేసుకుంది.  సరదాగా సాగిన టూర్‌ ప్రయాణం నెలల తరబడి చీకటి, రోగ నిర్థారణతో ముగిసింది. ఆమె సరదాగా రిపబ్లిక్‌ పర్యటనకు వెళ్లడమే కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికాలో తన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆ కష్టాలు పడింది. అక్కడ సరదాగా స్నాన చేస్తున్నప్పుడు కూడా కాంటాక్ట్‌ లెన్స్‌ ధరించే ఉంది. లెన్స్‌లు ఉపయోగించే వాళ్లు తరుచుగా చేసే పెద్ద తప్పిదమే ఇది. అలా స్నానం చేయడంతో జేమిసన్‌ కళ్లు అకాంతమీబా అనే సూక్ష్మజీవికి గురయ్యాయి. 

ఈ సూక్ష్మజీవి నీటిలో నివశిస్తుంది. అయితే నేత్ర వేద్యుడు ఆమె పరిస్థితిని తప్పుగా నిర్థారించి స్టెరాయిడ్‌ చుక్కల మందును సూచించాడు. ఆ మందులు తనకు సహాయపడకపోగా, ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రతరం చేశాయి. కేవలం ఒక వారంలోనే అకాంతమీబా కెరటైటిస్ కారణంగా తన దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఒక్కసారిగా జేమిసన్‌కి జీవితం తలకిందులైనట్లుగా అనిపించింది. సరైన రోగనిర్ధారణ ఆలస్యం కారణంగా ఆ కంటి ఇన్ఫెక్షన్‌ తనను  రెండు నెలలపాటు అంధురాలిగా గడిపేలా చేసిందని వాపోయింది. 

తాను ఇప్పుడు పక్కల నుంచి చూడగలను తప్ప ముందు నుంచి చూడలేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ముందువైపు కనుపాపపై ఇన్ఫెక్షన్‌ వల్ల ఏర్పడిన మచ్చ పూర్తిగా కప్పివేయడం వల్ల చూడలేనని పేర్కొంది. అది మడ్డులాంటి తెల్లదనాన్ని మాత్రమే చూపిస్తుందని తెలిపింది. అందువల్ల దయచేసి తనలా నీటిలో ఉన్నప్పుడు కాంటాక్స్‌ లెన్స్‌లను ధరించొద్దని హెచ్చరిస్తోందామె. ప్రస్తుతం తాను కొనసాగుతున్న చికిత్సల వల్ల కొంత దృష్టిని పొందగలిగినప్పటికీ..మన కళ్లు మునపటిలా పనిచేయవని అంటోంది. 

తాను తన చూపుని మరింత మెరుగుపరుచుకునేలా భవిష్యత్తులో మరిన్ని శస్త్ర చికత్సలు చేయించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. సో ఫ్రెండ్స్‌ స్నానం చేసేటప్పుడూ, ఈత కొట్టేటప్పుడూ, షవర్‌బాత్‌ సమయంలో కాంటాక్ట్‌ లెన్స్‌లను ధరించొద్దని అన్నారామె. ఎందుకంటే నీటిలో గనుక  హానికరమైన సూక్ష్మజీవులు ఉంటే లెన్స్‌లకు అంటిపెట్టుకుని ఇలాంటిఇన్‌ఫెక్షన్‌ను కలిగించే అవకాశం ఉటుందని హెచ్చరిస్తోంది జేమిసన్‌.

(చదవండి: ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్‌ ప్లాన్‌)

 

Videos

తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు

ఈ సినిమాలో పెద్ద స్టార్ట్ నటీమణులు ఒకేసారి కనిపించనున్నారు

పెళ్లి అయిన 3 నెలల నుంచే గర్భిణీ అని కూడా చూడలేదు

పవన్ కళ్యాణ్.. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?

భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?

మాజీ సీఎం నాదెండ్ల మృతిపై YS జగన్ సంతాపం

చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

సీఎం రేవంత్ పాటలు పై సింగర్ మధుప్రియ కామెంట్స్

జగనన్న ఇళ్లు కాదు ఊర్లు ఊర్లే సృష్టించాడు, అది వైఎస్ జగన్ అంటే..

సందిట్లో సడేమియా RTC సమ్మెతో.. తెలంగాణలో కర్ణాటక స్పెషల్ బస్సులు

Photos

+5

ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)

+5

తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్‌గా ఉందేంటి! (ఫొటోలు)

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)