Breaking News

ఎవరీ లీనా నాయర్‌? ఏకంగా బ్రిటిష్‌ అత్యున్నత గౌరవం..

Published on Fri, 06/13/2025 - 12:57

భారత సంతతి సీఈవో లీనా నాయర్‌కు బ్రిటన్‌ అత్యున్నత గౌరవం లభించింది. ఆమె ఛానెల్‌ సీఈవోగా రిటైల్‌ అండ్‌ వినియోగదారుల రంగంలో అత్యున్నతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఆ రంగంలో ఆమె అందించిన సేవలకు, కృషికి గానూ..యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఈ మేరకు ఛానెల్‌ గ్లోబెల​ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ లీనా నాయర్‌ను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియం కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు. 

ఈ కొత్తఏడాది 2025 గౌరవ పురస్కారాల జాబితాలో ఆమె ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. అంతేగాదు ఛానెల్‌ బ్రాండ్‌ లీనా శక్తిమంతమైన నాయకురాలిగా ప్రపంచఖ్యాతీ సంపాదించుకుందని ప్రశంసించింది. దీర్ఘకాలిక సమగ్ర వ్యాపార ప్రభావాన్ని అందించింది. తన బ్రాండ్‌ హవాను కొనసాగించడం, క్లయింట్‌ అనుభవాన్ని మెరుగుపరచడం,నిలకడగా సాగేలా వేగవంతం చేయడం వంటి సేవలను అందించిదని ఛానెల్‌ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 

కాగా భారతీయ వ్యాపార కార్యనిర్వాహకురాలిగి లీనా నాయర్ జనవరి 2022లో ఛానెల్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఛానెల్‌లో ఆమెనే తొలి భాతర సంతతి మహిళా సీఈవో. తన నాయకత్వంలో ఛానెల్‌ బ్రాండ్‌కి మంచి గుర్తింపు లభించేలా కృషి చేసింది. వినియోగదారులను ఆకర్షించేలా గణనీయమైన పురోగతిని అందుకునేలా చేసింది. ముఖ్యంగా కంపెనీ ఫౌండేషన్‌కు గణనీయమైన ఆర్థిక సహాయం లభించేలా చేసింది. 

తద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుండటం విశేషం. ఇక ఆమె ఛానెల్‌లో చేరడాని కంటే ముందు..యూనిలీవర్‌లో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. చివరగా లీనా స్వస్థలం భారత్‌లోని మహారాష్ట్రలోని కోల్హాపూర్‌. ఆమె బాల్యమంతా గడిచింది. ఉన్నత విద్య కోస యూకే వచ్చి అక్కడే సెటిల్‌ అయ్యారామె.  

(చదవండి: ఆన్‌లైన్‌ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్‌ఈ')
 

#

Tags : 1

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)