Breaking News

'ఇంత స్వేచ్ఛగా ఎప్పుడూ అనిపించలేదు'!

Published on Tue, 11/04/2025 - 14:01

మన మాతృగడ్డపై చాలామంది విదేశీయలు పలు విధాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ తన మనసుకి హత్తుకున్న వాటి గురించి కూడా మాట్లాడారు. తాజాగా ఆ కోవలోకి జర్మన్‌ మోటార్‌ సైకిల్‌ రైడర్‌ చేరిపోయాడు. ఆయన కూడా భారతదేశంలో పర్యటించేటప్పుడూ తనకు కలిగిన అనుభూతిని పంచుకోవడమే కాదు, ఇతర దేశాలతో పోల్చుతూ ఇక్కడే లభించే ఆనందం మాటలకందనిది అంటూ తన అనుభూతిని సోషల్‌ మీడియలో షేర్‌ చేసుకున్నాడు.

జర్మన్‌కి చెందిన మోటార్‌ రైడర్‌ మార్క్‌ ట్రావెల్స్‌గా పేరుగాంచిన మార్కస్‌ ఎంగెల్‌ భారతదేశాన్ని బెస్‌ టూరిస్ట్‌ ప్లేస్‌గా అభివర్ణిస్తూ..ఈ మాతృగడ్డపై తన అనుభవాన్ని షేర్‌ చేశారు. తన పర్యటనలో భారతదేశం అంతటా ప్రయాణించేటప్పుడూ..ప్రపంచంలో మరెక్కడా లేనంత స్వేచ్ఛను అనుభవించానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్‌ చేశారు. 

ఆ వీడియోలో భారతదేశం గురించి ఇంతకముందు చెప్పాను..మళ్లీ ఇప్పుడూ చెబుతాను. నేను ఇప్పటివరకు చాలా దేశాల్లో పర్యటించాను, కానీ భారతదేశంలో పొందిన స్వేచ్ఛ మరెక్కడ పొందలేదు. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టమైనది అని వీడియోలో చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి

, మార్కస్‌ ఎంగెల్‌ సాహసయాత్రలు, సుదూర మోటార్‌ సైకిల్‌ పర్యటనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ నేపథ్యంలోనే భారత్‌ వచ్చి కొన్నాళ్లు ఇక్కడ గడిపాడు కూడా. అతను కేవలం ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంతంలోని సంస్కృతిని అన్వేషిస్తాడు. ఇక మార్కస్‌ వీడియోలో తాను మళ్లీ కచ్చితంగా భారత్‌కి తిరిగి వస్తానని చెప్పాడు. ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం. చాలాకాలం ఇక్కడ ఉన్నా. 

అయినా నాకు ఇక్కడ ఉండేలా ఐదేళ్ల వీసా ఉంది. కాబట్టి మళ్లీ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్‌లో వాలిపోతా. ఇక్కడ పర్యటిస్తే కలిగే ఫీల్‌ వేరేలెవెల్‌. అని వీడియోని ముగించాడు. ఈ వీడియో నెట్టింట రెండు లక్షలు పైనే వ్యూస్‌, వేలల్లో లైక్‌లు వచ్చాయి. భారతదేశం అద్దం లాంటిదని..ఇక్కడ తన అందమైన గమ్యస్థానాలను చూపిస్తూ..తనలో కలిపేసుకుంటుంది. అలానే మిమ్మల్ని వశపరుచుకుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, 15 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ సంగీతకారుడిగా పనిచేసిన తర్వాత మార్క్ 2020లో పూర్తి సమయం మోటో-వ్లాగర్‌గా మారాడు. 

(చదవండి: వండర్‌ బర్డ్స్‌..థండర్‌ కిడ్స్‌..)

#

Tags : 1

Videos

బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!

మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు

తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల

రన్నింగ్ బస్సులో మంటలు.. RTC బస్సు దగ్ధం..!

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

Photos

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)