Breaking News

అదిగో అదే భారత్‌లో అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం..!

Published on Sat, 11/08/2025 - 13:47

భారత్‌ని సందర్శించిన జర్మన్‌ వ్లాగర్‌ అలెక్స్‌ వెల్డర్‌ ఇప్పటివరకు తాను చూసిన వాటిలో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అంటూ దాని గురించి వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడమే కాదు..నెట్టింట ఆ ప్రదేశం హాట్‌టాపిక్‌గా మారింది. 

జర్మన్‌ వ్లాగర్‌ అలెక్స్‌ భారతదేశంలో తాను చూసిన అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం ఇదేనని క్యాప్షన్‌ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశాడు. ఆ వీడియోలో తాను దక్షిణ గోవాని సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నాడు. "బహుశా భారతదేశంలో నేను  చూసిన వాటిల్లో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అయ్యి ఉండొచ్చు. 

కచ్చితంగా ఈ గోవా సూపర్‌ పార్టీ హాట్‌ స్పాట్‌ అవుతుంది. ఇక్కడకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అయినా ఇక్కడ చెత్త ఉంటుదని అంచనవేయలేంద. ఈ దక్షిణ గోవా చుట్టూ తిరxగా ఎక్కడా.. చిన్న చెత్త ముక్క దొరకలేదు అంటూ ఆశ్చర్యపోయాడు. తాను అక్కడ ముగ్గురు స్థానికులను చూశానని, వాళ్లు ఆకాశం వైపు చూసి నవ్వుతూ ఉండటం చూశానని అన్నాడు. 

ఈ ప్రదేశం అందానికి నిజంగా మంత్ర ముగ్దుడుని అయిపోయా..ఇది నిజంగా యూరప్‌లా అనిపిస్తోంది. కచ్చితంగా దీన్ని చూడాగానే ఎవ్వరైనా..ఉష్ణమండల దేశమైన భారత్‌ అని అనుకోరు. ఇక్కడ ఎక్కడ మీకు ఒక్క చెత్త డబ్బ కనిపించదు. ఈ ప్రదేశానని చూసి కచ్చితంగా ఇంప్రెస్‌ అవుతారు. ఇది నిజంగా అందంగా ఉంది అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు అలెక్స్‌. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ప్రదేశం ఎప్పటికీ అలానే ఉండాలి అని ఆశిస్తున్నాం, కోరుకుంటుంన్నాం అంటూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: అతిపెద్ద సాలీడు గూడు..ఏకంగా లక్షకు పైగా సాలెపురుగుల నైపుణ్యం..!)

 

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)