Breaking News

చిరునవ్వే సిగ్నేచర్‌ లుక్‌!

Published on Sun, 08/03/2025 - 09:05

ఒక్క చిరునవ్వుతో వెండితెరపై వెలుగులు కురిపించే నటి జెనీలియా దేశ్‌ముఖ్‌. ఎప్పుడూ క్లాసిక్‌ అందాన్ని కంఫర్ట్‌తో కలిపి, ఫ్రెష్‌ ఫ్యాషన్‌తో మెరిసిపోతుంది. ఆ యూనిక్‌ చార్మ్‌ను సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ చూపిస్తోంది. 

జ్యూలరీ బ్రాండ్‌: షాచీ ఫైన్‌ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
చీర బ్రాండ్‌: యాష్‌డెన్‌, ధర: రూ. 98,000

నాకు స్టయిల్‌ అంటే సింప్లిసిటీ. ట్రెండ్‌ కంటే కంఫర్ట్‌ ముఖ్యం. చిన్న చోకర్, లైట్‌ ఇయర్‌ రింగ్స్, సాఫ్ట్‌ లిప్‌గ్లోస్, ఇదే నా సిగ్నేచర్‌ లుక్‌. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే మేకప్‌ లేకపోయినా, ముఖం ఆటోమేటిక్‌గా మెరిసిపోతుందని చెబుతోంది జెనీలియా.

రిబ్బన్స్‌  రీ ఎంట్రీ!
ఒకప్పుడు జడకే పరిమితమైన ఈ నాజూకైన పట్టీ, రిబ్బన్స్‌. ఇప్పుడు మెడ మీద మెరిసేలా ఓ కొత్త స్టయిల్‌ స్టేట్‌మెంట్‌ను సృష్టిస్తోంది. జడల చివర అలముకునే ఈ చిన్నదానికి ఇప్పుడు ఫ్యాషన్‌లో పెద్ద స్థానం దక్కుతోంది. ఇది వచ్చినప్పటి నుంచీ పొడవైన హారాల జమానా కాస్త వెనక్కి వెళ్లిందనే చెప్పాలి. 

మధ్యలో ఓ చిన్న పెండెంట్, చుట్టూ సన్నని రిబ్బతో వచ్చే ఈ చోకర్‌ వేసుకొని, అద్దం ముందు నిలబడగానే ‘ఇంత అందంగా నేనేనా?’ అన్న ఆశ్చర్యంతో మురిసిపోతారు! చీరా, లెహంగా, కుర్తా ఏదైనా సరే, ఈ రిబ్బన్స్‌  చోకర్‌ మెడమీద పడితే లుక్‌కి కొత్త శోభ చేకూరుతుంది. హెయిర్‌ స్టయిల్‌ బ్రేడ్‌ అయినా, బన్‌  అయినా, ఏదైనా మెడ భాగం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. 

మేకప్‌ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ టచ్‌ ఇచ్చినా సరే, చోకర్‌ ముఖాన్ని హైలైట్‌ చేయగలదు. ఇది వేసుకున్నాక, ఇంకొక హారం అవసరం లేదు. ఎందుకంటే, ఈ ఒక్కదానికే పొడవైన హారాల గర్వాన్ని తగ్గించేంత స్టయిల్, పవర్‌ ఉంది. చిన్నదిగా కనిపించినా, గొప్పగా మెరిసిపోతుంది. 

(చదవండి:  సెల్ఫ్‌ బ్రాండ్‌..అదే ట్రెండ్‌..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..)
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)