Breaking News

ఘనమైన ఆసనం

Published on Sun, 09/13/2026 - 10:51

గణేష్‌ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతోపాటు ఆసనం, బ్యాక్‌గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే,  ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?

ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్‌ ప్లానర్స్‌ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్‌ వర్క్‌ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. 

అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్‌ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్‌ను స్టోర్‌ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.

స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్‌లు, అపార్ట్‌మెంట్‌లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ  చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్‌ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్‌ లేదా కాపర్‌ ఫినిష్‌తో ఉండే ఆర్టిఫిషియల్‌ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్‌ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్‌ హోమ్‌ డెకార్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్‌ లుక్‌ తీసుకొస్తుంది.

సులభంగా అలంకరణ కృష్ణాష్టమి, గణేష్‌ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్‌ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్‌ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్‌ క్లాత్‌తోపాటు ఖరీదైన స్టోన్స్‌ కూడా ఉపయోగించి డిజైన్‌ చేస్తున్నాం. 
– లక్ష్మి సింగ్లా, డెకార్‌ క్రియేషన్స్‌  
 – నిర్మలారెడ్డి

చదవండి: చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య!

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)