Breaking News

గాలి కుంటు వ్యాధి

Published on Tue, 04/15/2025 - 00:51

వేసవిలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు మొదలయిన చీలుగిట్టలుండే జంతువులకు సంక్రమించే వైరస్‌ వ్యాధుల్లో గాలికుంటు ముఖ్యమైనది. నోటికి, గిట్టలకు పుళ్లవుతాయి కాబట్టి ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ (ఎఫ్‌ఎండి) అంటారు. ఆప్తో వైరస్‌ ఈ వ్యాధిని కలిగిస్తుంది. ఇది సోకకుండా ముందు  జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. గాలి, ఇతర  మార్గాల్లో ద్వారా వ్యాపిస్తుంది. మరణాల శాతం తక్కువైనప్పటికీ, పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గి రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది.

టీకాలతో నివారణ ఉత్తమం
→ గాలికుంటు వ్యాధికి చికిత్సలేదు. నివారణ మార్గాలపై శ్రద్ధ వహించాలి. గాలికుంటు వ్యాధి టీకాలు మొదటిసారి 2 నెలల వయసులో, బూస్టర్‌ డోసు ఒక నెల తర్వాత చేయించాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. 
→ గాలికుంటు వ్యాధి నివారణకు 6 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వ పశు సంవర్థక శాఖ ఉచితంగా టీకా వేస్తోంది. రైతులు సమీపంలోని ప్రభుత్వ పశు వైద్యుడ్ని సంప్రదించి పశువులకు టీకాలు వేయించుకొని ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి తోడ్పడాలి.
→ వ్యాధిగ్రస్త పశువుల నోటి చొంగలో వైరస్‌ అధిక శాతం వుంటుంది. ఈ చొంగ పడిన మేత, దాణా, నీరు, మల మూత్రాదుల్లో సంవత్సరం వరకు వైరస్‌ దాగి వుంటుంది. అనుకూల పరిస్థితుల్లో తిరిగి వ్యాధిని కలిగిస్తుంది. అందువల్ల వ్యాధి సోకిన పశుశాలలను  సోడియం హైడ్రాక్సైడ్, 2% ఫార్మాలిన్, 4% సోడియం కార్బోనేటు వంటి మందులతో శుభ్రం చేస్తే వైరస్‌ నశిస్తుంది. 
→ ఆబోతుల, దున్నల వీర్యం ద్వారా కూడా ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. 3 నెలల వరకు సంపర్కానికి నియోగించకూడదు. వ్యాధి సోకిన పశువుల పాలు దూడలు తాగకుండా చూడాలి. సంత నుంచి తెచ్చిన పశువుల్ని మూడు వారాలు విడిగా వుంచి, పరిశీలించి, టీకాలు వేయించిన తర్వాత ఆరోగ్యంగా వున్న పశువులతో కలువనివ్వాలి.

గాలికుంటు వ్యాధి లక్షణాలు
→ గాలికుంటు వ్యాధి లక్షణాలు గొర్రెలు, మేకల్లో కన్నా పశువుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104– 106  డిగ్రీల సెల్షియస్‌ వరకు ఉంటుంది. 
→ నోటిలో చర్మపు పొరలు, పళ్ల చిగుళ్లు, నాలుక, ముట్టె లోపలి ప్రాంతాల్లో బొబ్బలు పొక్కి, చితకటం వల్ల పశువులు మేత తినవు. నోటి నుంచి చొంగ, నురుగు విపరీతంగా కారుతుంది. 
→ గిట్టల మధ్య, గిట్టపైన బొబ్బలు ఏర్పడి, చితికి పుళ్లవుతాయి. నొప్పి వల్ల పశువులు నడవలేక కుంటుతాయి. చను మొనలపై కూడా బొబ్బలు ఏర్పడి పొదుగు వాపు కనిపిస్తుంది.  
→ వ్యాధి సోకిన పశువుల పాలు తాగి దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులకు ఉపయోగపడవు. చూలి పశువులకు గర్భస్రావాలవుతాయి. 
→ పశువులు రక్తహీనతకు గురై శ్వాస కష్టంగా పీల్చతూ, రొప్పుతూ, ఎండవేడికి తట్టుకోలేక నీరసించిపోతాయి. ఈ లక్షణాలన్నీ ఎక్కువగా సంకరజాతి పశువుల్లో కనిపిస్తాయి.

లక్షణాలకు అనుగుణంగా చికిత్స
→ వ్యాధి సోకిన పశువులను ఇతర పశు­వుల నుంచి వేరు చేసి, సత్వర చికిత్స చేయించాలి. వైరస్‌వ్యాధి కాబట్టి మందు­లు పనిచేయవు. వ్యాధి లక్షణాలకు అనుగుణంగా చికిత్స చేయాలి. 
→ నోటిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేటు కలిపిన నీళ్లతో శభ్రం చేసి, వాటికి బోరోగ్లిజరిన్, యాంటి సెంప్టిక్‌ ఆయింట్‌మెంటు పూయాలి. కాలి పుండ్లకు జింక్‌ ఆక్సైడ్, లొరాక్సిన్, హిమాక్స్‌ వంటి ఆయింట్‌మెంట్‌ పూయాలి. 
→ ఈగలు వాలకుండా వేపనూనె, లినమెంట్‌ వంటి వాటిని వాడాలి. అలాగే నోటిలోని చిగుర్లు, పుండ్ల పొరలు అభివృద్ధికి విటమిన్‌–సి కలిగివుండే పౌడర్‌ ఆప్తోకేర్‌ వంటి వాటిని వాడాలి. 
→ బాక్టీరియా సోకకుండా యాంటిబయోటిక్‌ మందులు 3–5 రోజులు వాడాలి. ఉపశమనం కోసం మెలోక్షికమ్‌ మందులు వాడాలి. అలాగే విటమిన్లు, బి–కాంప్లెక్స్‌లతో కూడిన టానిక్‌లను ఇచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. 
→ జావ/జొన్న అన్నం, చిటికెడు ఉప్పు, బెల్లం కలిపి ప్రతి రోజు తాగించటం ద్వారా బలహీనపడకుండా జాగ్రత్త వహించాలి. పశువు బాగా నీరసిస్తే గ్లూకోజ్‌ రక్తంలోకి ఇవ్వాల్సి వుంటుంది.

గృహ వైద్యం
→ పటిక లేదా వెలిగారమును కలిపిన నీటితో నోటి పుళ్ళు, కాలి పుండ్లను కడగాలి. పావు కిలో రాగులు, పావు కిలో పెసలు ఉడకబెట్టి, 250 గ్రాములు నువ్వుల నూనెలో బాగా పిసికి.. రోజుకు 2 సార్లు తినిపించాలి. కాళ్ళకు నువ్వుల నూనె కడియం వేయాలి.
→ జ్వరం తగ్గటానికి సురేకారం 20 గ్రాములు, ఉప్పు 30 గ్రాములు, నేలవేము 30 గ్రాములు, బెల్లం 120 గ్రాములు, అర లీటరు వేడి నీళ్ళలో కలిపి రోజుకు 2 సార్లు తాగించాలి.

హెూమియో చికిత్స
→ వ్యాధి ప్రబలిన ప్రాంతంలో పశువులకు మెర్క్‌ సోల్‌ 200 గానీ, కాల్‌ బైక్రోమికమ్‌ 200 గానీ, సిఫిలినం 200 గానీ ఏదో ఒకదాన్ని వాడితే వ్యాధి సోకకుండా పశువులను కాపాడుకోవచ్చు. 10 మాత్రలు చొప్పున ప్రతి రోజూ ఒకసారి తినిపిస్తే వ్యాధినిరోధకంగా పనిచేస్తుంది. 
→ వ్యాధి సోకితే అది తగ్గటానికి.. మెర్క్‌ సోల్‌ 200 లేదా కాల్‌ బైక్రోమికమ్‌ 200 లేదా సిఫిలినం 200 లేదా ఎకినేసియా 200 లేదా బోరాక్స్‌ 200 లేదా కాలి క్లోరాటం 200.. వీటిలో ఏదైనా ఒక మందును 10 మాత్రలు చొప్పున రోజుకు 2 సార్లు దొన తినిపించాలి.
→ నోరు పుళ్ళు పడినపుడు బోరాక్స్‌ లేదా హైడ్రాస్టిస్‌ లేదా హైడ్రాస్టినమ్‌ మ్యూరియటికం లేదా ఎకినేసియా ‘క్యూ’.. వీటిలో ఏదైనా ఒక 
మందు మదర్‌ టింక్చర్‌ను 1 మి.లీ.ను 10 మి.లీ. నీటిలో కలిపి నోటి పుళ్ళు కడగాలి. 
→ డెక్కెల మధ్య పుళ్ళకు ఎకినేసియా లేక కాలెండ్యుల మదర్‌ టింక్చర్‌ను సమపాళ్ళలో కొబ్బరి నూనెలో గాని వ్యాసలైన్లో గానీ కలిపి రాయాలి.
→ జ్వర తీవ్రత వుంటే హెపార్‌ సల్ఫ్‌ 1ఎం లేదా రుస్‌టాక్స్‌ 1ఎం మందును 10 మాత్రలు చొప్పున రోజుకు 2 సార్లు తినిపించాలి.

– డాక్టర్‌ జి. రాంబాబు, పశువైధ్యాధికారి, కడప.
మొబైల్‌: 94945 88885

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)