Breaking News

World Elephant Day 2024: గజరాజుల గమ్మతులు..

Published on Sun, 08/11/2024 - 03:10

మనుషులకు మాలిమి అయిన జంతువుల్లో ఏనుగులు ప్రత్యేకమైనవి. రాచరికాలు వర్ధిల్లిన కాలంలో రాజ్య రక్షణ కోసం ఉపయోగపడే చతురంగ బలాల్లో గజబలం కీలకమైనది. భావోద్వేగాలను అనుభూతి చెందడంలోను, వాటిని ప్రకటించడంలోను ఏనుగుల ప్రవర్తన దాదాపుగా మనుషులను పోలి ఉంటుంది. సాటి ఏనుగుల పట్లనే కాదు, తమను మాలిమి చేసుకునే మనుషుల పట్ల కూడా ఏనుగులు భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి.

  • ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. తమకు నేస్తాలుగా ఉన్న ఏనుగులను చూసినప్పుడు సంతోషంగా చెవులు విప్పార్చడం, తోక ఊపడం, శరీరాన్ని కదిలించడం వంటి చర్యల ద్వారా పలకరిస్తాయి. చాలాకాలం తర్వాత కనిపించినట్లయితే, పట్టరాని సంతోషంతో ఘీంకారనాదం చేస్తాయి.

  • నేస్తాలైన ఏనుగులు ఎదురెదురుగా తారసపడినప్పుడు ఒకదానికొకటి తొండాలను పెనవేసుకుని తమ ఆత్మీయతను వ్యక్తం చేస్తాయి. వేర్వేరు దారుల్లో వెళుతున్న మగ ఏనుగులు తమ నేస్తాలను శరీరాన్ని తాకించుకుని పలకరించుకుంటాయి.

  • ఏనుగులు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయి. ఆకలి వేసినప్పుడు గున్న ఏనుగులు తమ చేష్టల ద్వారా తల్లులకు ఆ సంగతి చెబుతాయి. అల్లరిని వారించినప్పుడు అలుగుతాయి. గున్నటేనుగులు అలిగినప్పుడు ఎక్కడివక్కడే ఆగిపోయి, ఘీంకారంతో పిలిచే తల్లుల వెంట వెంటనే వెళ్లకుండా హఠం చేస్తాయి. తల్లి ఏనుగు మెల్లగా బుజ్జగిస్తేనే అవి మళ్లీ దారిలోకి వస్తాయి.

  • ఈడొచ్చిన మగ ఏనుగులు తాము జతకట్టదలచుకున్న ఆడ ఏనుగులను ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాయి. వాటితో సల్లాపాలడతాయి. ఏనుగులు జత కట్టిన తర్వాత కుటుంబాన్ని ఏర్పరచుకుంటాయి. కుటుంబాన్ని కాపాడుకునేందుకు గుంపుగా సంచరిస్తుంటాయి.

  • వివిధ సందర్భాల్లో ఏనుగులు వ్యక్తం చేసే భావోద్వేగాలకు సంబంధించిన ప్రవర్తనలను తెలుసుకోవడానికి వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రత్యేక అధ్యయనం చేపట్టారు. ఆఫ్రికా అడవుల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో వారు ఏనుగుల భావోద్వేగ ప్రకటనలకు సంబంధించి 1,282 రకాల ప్రవర్తనలను గుర్తించారు.ఏనుగులు కూడా మనుషుల మాదిరిగానే ఆత్మీయులను కోల్పోయినప్పుడు దుఃఖిస్తాయి. ఏనుగులు తమ ఆత్మీయులను ఒక పట్టాన మరచిపోలేవు. మరణించిన ఏనుగు కళేబరం చుట్టూ చేరి మిగిలిన ఏనుగులు కన్నీరు కారుస్తూ రోదిస్తాయి. కళేబరాన్ని క్రూరజంతువులు పీక్కు తినకుండా కాపలాగా ఉంటాయి. చుట్టూ మట్టి ఉన్నట్లయితే, మరణించిన ఏనుగు కళేబరాన్ని మిగిలిన ఏనుగులు పూడ్చి పెడతాయని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చెప్పుకొనే కథలు వాస్తవమేనని పుణేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు తేల్చారు.

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)