Breaking News

కలలు కూడా గైడ్‌ చేస్తాయా..?

Published on Sun, 11/01/2026 - 13:14

అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచాడు అభిమన్యు. నుదుట చెమటలు పడుతున్నాయి, శ్వాస వేగంగా ఆడుతోంది. మళ్లీ అదే కల! అతని బాల్యానికి సంబంధించిన ఒక చీకటి జ్ఞాపకం. ‘అన్నయ్యా... నన్ను కాపాడు!’ అంటూ తన చెల్లెలు దీనంగా ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యం. టైం చూసుకున్నాడు అర్ధరాత్రి రెండు గంటలు...అందులో ఒక ఎర్రటి ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడి ఉన్నా ఏ మాత్రం వేగం తగ్గకుండా ఒక కారు ఎడమవైపు ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం వైపు అత్యంత వేగంగా దూసుకుపోతుంది. ఆ కారులోనే తన చెల్లి బందీగా ఉంది.  పదే పదే వచ్చే ఈ కల అతన్ని వెంటాడుతోంది.
∙∙ 
డాక్టర్‌ పార్థసారథి. సైకాలజిస్ట్‌...‘అభిమన్యు, మీ బాల్యం మిమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. మీ నుంచి దూరమైనా, మీ చెల్లెలు పదేపదే మీకు గుర్తుకొస్తోంది. మన భయాలు, బాధలు, కోరికలు, ఇష్టాలు, అసలు వీటితో సంబంధం లేని విషయాలు కూడా కలలుగా వస్తాయి...’ అని విశ్లేషించాడు.

సరిగ్గా అదే సమయంలో అభిమన్యు ఫోన్‌ మోగింది. కమిషనర్‌ ఆఫీస్‌ నుంచి...‘మిస్టర్‌ అభిమన్యు... ఒకే రోజు, నగరంలోని ఐదు వేర్వేరు ప్రాంతాల నుంచి ఎనిమిదేళ్ల లోపు ఉన్న ఐదుగురు ఆడపిల్లలు అదృశ్యమయ్యారు. ఆ ఐదు నగరంలోని ఒకదానితో మరొకటి సంబంధం లేని ప్రాంతాలు. కిడ్నాపర్లు చాలా పకడ్బందీగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. మీడియాకు ఈ విషయం చేరకముందే ఈ కేసును పరిష్కరించాలి, అది నీ వల్లే అవుతుంది’ కమిషనర్‌  అన్నాడు.
∙∙ 
అభిమన్యు అమ్మాయిలు కనిపించకుండా పోయిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను తెప్పించాడు. వాటిని నిశితంగా పరిశీలించిన తర్వాత అతనికి ఒక కీలకమైన విషయం అర్థమైంది. వాళ్ళు మాయమైన కచ్చితమైన లోకేషన్స్‌లో మాత్రమే సీసీ కెమెరాలు పని చేయడం లేదన్న విషయాన్ని నోటీస్‌ చేశాడు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన నేరమని నిర్ధారించుకున్నాడు.

వెంటనే సీసీ కెమెరాలు పనిచేయని ఆ స్పాట్స్‌కు చేరుకున్నాడు. అభిమన్యు ఆ పరిసరాలను గమనిస్తుండగా, అకస్మాత్తుగా అతని కళ్లు ఒక మూల ఉన్న ఎర్రటి ట్రాఫిక్‌ సిగ్నల్‌ పై పడ్డాయి. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అది అచ్చం అతనికి కలలో కనిపించిన రెడ్‌ సిగ్నల్‌! అతని మెదడు ఆ ప్రాంతాన్ని స్కాన్‌ చేయడం మొదలుపెట్టింది. ఈ సిగ్నల్‌ నుంచి ఎడమవైపు వెళ్తే దట్టమైన అడవి ప్రాంతం, కిడ్నాపర్లకు సురక్షిత ప్రాంతం. కలలో కారు సిగ్నల్‌ పడ్డాక ఎడమ వైపుకు దూసుకుపోయింది. 

కిడ్నాపర్లు కూడా ఇక్కడి నుంచి అటువైపే వెళ్లి ఉంటారా? వెంటనే ఎడమ వైపుకు కారును  మళ్ళించాడు. కొంత దూరం వెళ్లగానే అక్కడ దట్టమైన పొదలు, చెట్లు దట్టంగా అల్లుకుని ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతం కనిపించింది. అక్కడ  ఆ పొదల మాటున ఎవరి కంటా పడకుండా దాచి ఉంచిన ఒక పాత వ్యాన్‌ కనిపించింది. నెమ్మదిగా వెళ్లి వ్యాన్‌ డోరు తెరిచాడు. అందులో అయిదుగురు అమ్మాయిలు కాళ్ళూ చేతులు కట్టబడి స్పృహలేని స్థితిలో కనిపించారు. అందులో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్టు అనిపించింది.

ఆ ఆరో అమ్మాయి తన చెల్లెలే...
కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుండగా, అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. దూరంగా పాడుబడ్డ ఇల్లు. చప్పుడు చేయకుండా రివాల్వర్‌ను కుడి చేత్తో పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అందులో నలుగురు ఆగంతకులు. అభిమన్యు మెమరీ వెంటనే యాక్టివేట్‌ అయ్యింది. వాళ్ళు  చైల్డ్‌ ట్రాఫికింగ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌. విచారణ, కోర్టు, ఇంటరాగేషన్‌ వేస్ట్‌. చిన్నారులను చిదిమేసే విష పురుగులు... 

సైలెన్సర్‌ అమర్చిన రివాల్వర్‌...
కేవలం నాలుగు బుల్లెట్స్‌ మాత్రమే ఉపయోగించాడు. చాలా ఏకాగ్రతగా, కిక్కురుమన్న శబ్దం లేకుండా నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.‘సర్‌. కిడ్నాపర్లు దొరికారు. ఎదురు దాడి చేశారు. నాలుగు బుల్లెట్స్‌ వాడాను. చిన్నారులను వాళ్ళ ఇంటికి తరలించండి. ఈ విషయం మీడియాకు తెలియాల్సిన అవసరం లేదు. ‘కేసు క్లోజ్‌’ చెప్పాడు అభిమన్యు. కమిషనర్‌తో...
∙∙ 
‘సైకాలజీలో డ్రీమ్‌ థియరీ గురించి మీకు చెప్పాలి. మన మెదడులోని అన్‌ కాన్షియస్‌ మైండ్‌ మనం గమనించలేని ఎన్నో సూక్ష్మమైన విషయాలను గ్రహిస్తుంది. ఒక్కోసారి కలలు మనల్ని సరైన మార్గంలో గైడ్‌ చేస్తాయి. మీ చెల్లెలు కలలో కనిపించి మీకు ఒక అత్యంత కీలకమైన క్లూయే ఇచ్చింది.’ ఆ రోజు సాయంత్రం పార్టీలో కలిసిన డాక్టర్‌ చెప్పాడు.
శ్రీసుధామయి

ఇదీ చదవండి: బాణాసంచా మెరుపుల్‌..ఘనాంకాల ముచ్చట్లు
 


 

#

Tags : 1

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)