Breaking News

తల్లిదండ్రులే రోల్‌ మోడల్స్‌

Published on Sun, 05/03/2026 - 08:47

పిల్లల మనస్సుల్లో మీ కలలను రుద్దకండి. ప్రతి శిశువు తన స్వంత ఆశయాలతో జన్మిస్తుంది అని చెబుతారు ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి భార్య సుధామూర్తి. పేరెంటింగ్‌పై ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం. పిల్లల పెంపకంపై ఆమె పలు పుస్తకాలను కూడా రాశారు. పిల్లలను మంచి దారిలో నడిపించేందుకు ఆమె చెప్పిన కొన్ని మాటలు...

  • పిల్లలకు తల్లిదండ్రులే మొదటి రోల్‌ మోడల్స్‌. పిల్లలు మనం చెప్పే మాటల కంటే, మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. కాబట్టి మంచి ప్రవర్తనను ఆచరించి చూపడం చాలా ముఖ్యం. మనం ఒక మంచి ఉదాహరణగా నిలిచినప్పుడు, పిల్లలకు ప్రత్యేకంగా క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం ఉండదు.

  • తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి విద్య. అయితే, చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, అందులో జీవన నైపుణ్యాలు, జిజ్ఞాస, సాంస్కృతిక అవగాహన కూడా ఉండేలా నేర్పించాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల జీవితాల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన లక్ష్యాలను పిల్లలతో పూర్తిచేయించాలనుకోవడం పొరపాటు. పిల్లలు వారి సొంత ఆశలు, ఆశయాలతో వస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేయగలిగిన ఉత్తమమైన పని– పిల్లలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించడంలో సహాయపడటం.

  • ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. డబ్బు ఉందని అహం చూపిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని పేరెంట్స్‌ ఫాలో అయితే పిల్లలు కూడా ఆ లక్షణం నేర్చుకుంటారు. అలాగే పిల్లలకు ఉన్నదానితో తృప్తి చెందడం, కృతజ్ఞతా భావంతో ఉండటం నేర్పించాలి. వస్తువుల కంటే సంబంధాలే ముఖ్యమని నేర్పాలి. 

  • కుటుంబంతో కలిసి భోజనం చేయడం వంటి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం వల్ల పిల్లల్లో వినయం, సానుభూతి పెరుగుతాయి. ఖరీదైన బహుమతుల కంటే అర్థవంతమైన అనుభవాలను పంచుకోవడం ద్వారా తల్లిదండ్రులు ఈ విలువలను పిల్లలకు నేర్పవచ్చు. 

  • చాలామంది జీవితంలో మనం కష్టపడ్డాం కదా, మన పిల్లలకు ఆ కష్టం తెలియకూడదు అని వారికి అన్నీ అడగకముందే సమకూరుస్తుంటారు. కానీ పిల్లలకు కూడా కష్టం విలువ తెలిసేలా చేయాలి. 

  • పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పడం, ఇంటి పనుల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారు తాము కూడా కుటుంబంలో ఒక భాగమని, తాము కూడా సహకరించాలని అర్థం చేసుకుంటారు. 

  • పిల్లల్లో దయ, సానుభూతిని పెంపొందించాలి. పిల్లల పెంపకంలో ఇది ప్రధానమైనది. పిల్లల్లో కరుణను నింపడం వల్ల సమాజానికి మేలు జరగడమే కాకుండా, వారు అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకుంటారు. పిల్లలను ఇతరులతో పోల్చకండి. ప్రతి బిడ్డకు వారి స్వంత బలాలు, బలహీనతలు ఉంటాయి. వారిలోని ప్రత్యేకతను గుర్తించకుండా ఇతరులతో పోల్చడం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.

  • పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, వెంటనే ఇచ్చేయకండి. అది నిజంగా అవసరమో కాదో తెలుసుకోండి. పిల్లలు అడిగే వస్తువు ప్రాముఖ్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అడిగిన వెంటనే పిల్లలకు అందించడం వల్ల వారికి ఆ వస్తువు విలువ తెలియదు. అలాగే ప్రస్తుతం పిల్లలకు పాకెట్‌ మనీ అని డబ్బులు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు. దానివల్ల వారికి డబ్బు విలువ తెలియదు. 

  • పిల్లలతో నిత్యం మాట్లాడుతూ, సమయం గడపండి. ప్రతి విషయం గురించి వారితో చర్చించండి. మీ పిల్లల మనస్సులో ఏముందో తెలుసుకోవాలంటే వారితో సంభాషించడం, వారు చెప్పేది వినడం ద్వారా వారి సంతోషాలు, ఆసక్తులు, ప్రపంచం పట్ల వారి దృక్పథం అర్థమవుతుంది. ఎదుటివారి హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం నేర్పించాలి. 

  • పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా ఏకాంతంగా, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను అతిగా పర్యవేక్షించడం, ప్రతి చిన్న విషయంపై ప్రశ్నించడం వంటివి చేసినప్పుడు, పిల్లలు తాము నమ్మకాన్ని కోల్పోతున్నామని భావిస్తారు. దాంతో విషయాలను దాచడం లేదా అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. అలాకాకుండా పిల్లలు స్నేహపూర్వకంగా మెలగాలి. 

  • పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. ఇది పిల్లలు తమను తాము నమ్ముకోవడానికి, సవాళ్లను అధిగమించడానికి, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడటానికి సహాయపడుతుంది. ‘నువ్వు ఏదైనా సాధించగలవు’, ‘నీ ప్రయత్నం నాకు చాలా గర్వంగా ఉంది’ వంటి సానుకూలమైన మాటలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. 

Videos

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లేవు.. హైకోర్టుకు తేల్చి చెప్పిన ప్రభుత్వం

నడిపించేది మొత్తం మంగ్లీ..! డబ్బులే డబ్బులు అని నమ్మించి ఇలా చేసింది

బుర్జు ఖలీఫాను మించి ఖర్చు.. దోపిడీకి కేరాఫ్ అమరావతి

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఏసీ పేలడంతో 9 మంది మృతి

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

Photos

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)