Breaking News

Miss World 2025: బ్యూటీ విత్‌ ఫన్‌..

Published on Wed, 05/14/2025 - 07:15

సాక్షి,  హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌ –2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం అందాల మగువల శోభను అలంకిరించుకుంది. హైటెక్‌ సిటీలోని ట్రైడెంట్‌ హోటల్‌ వేదికగా వసతి పొందుతున్న ఈ సుందరాంగులు ఏ మాత్రం సమయం దొరికినా ఫన్‌ యాక్టివిటీస్‌తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు తెలుగు సినీ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. నన్ను చుట్టూకుంటివే’ అనే పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు.

 ఈ సందర్భంగా ఆ పాటకు అనుగుణంగా మిస్‌ డెన్మార్క్, మిస్‌ చెక్‌ రిపబ్లిక్, మిస్‌ జెర్మనీ సుందరాంగులు ఒరిజినల్‌ స్టెప్పులేశారు. మరి కొందరు తారలు సోషల్‌ మీడియా యాప్స్‌ కోసం సెల్ఫీ మోడ్‌లో రీల్స్‌ చేస్తూ సందడి చేశారు. మిస్‌ వరల్డ్‌ పోటీలతో పాటు వినోదం కోసం చేస్తున్న ఈ రీల్స్, ఫొటో షూట్‌లను ఎప్పటికప్పుడు వారి ఇన్‌స్టా, ఎక్స్‌ ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే మిస్‌ ఇండియా నందినీ గుప్తా అందమైన అధునాతన–సంప్రదాయ సమ్మిళిత దుస్తుల్లో హోటల్‌లోని స్విమ్మింగ్‌ ఫూల్‌ పరిసరాల్లో చేసిన క్యాట్‌ వాక్‌ను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా బ్రెజిల్, బోత్వానా, ఘనా, ఎల్‌ సెల్వడోర్‌ వంటి దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ తారలు ఒకరినొకరు తమ మొబైల్స్‌లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు.   

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)