Breaking News

అందువల్లే భారత్‌ చాలా స్పెషల్‌..!

Published on Sat, 02/07/2026 - 12:32

భారత్‌లో నివశించిన చాలామంది విదేశీయలు భారత్‌పై మనుసు పారేసుకుని ఇక్కడే ఉండిపోవడమే కాదు..తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుచున్నామని కూడా చెప్పారు చాలామంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ఫ్రెంచ్‌ మహిళ కూడా చేరిపోయింది. భారత్‌ని ప్రత్యేకంగా చూపే విషయాలను వివరించి అందరి మనుసులు దోచుకుంది. మన దేశ గొప్ప తనాన్ని, ఔన్యత్యాన్ని రెండు మాటల్లో చాలా చక్కగా వివరించారామె. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

భారతదేశంలో నివసిస్తున్న ఓ ఫ్రెంచ్‌ మహిళ షేర్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవ్వడమే గాక అందర్నీ అమితంగా ఆకర్షించింది. తన స్వదేశమైన ఫ్రాన్సుతో భారత్‌ని పోలుస్తూ..ఆ విషయాల్లో ఫ్రాన్స్‌ కంటే భారత్‌ ముందు ఉందని అన్నారామె. అలాగే భారత్‌ని ప్రత్యేకంగా చూపించే అంశాలను సైతం ప్రస్తావించారామె. 

ఈ మూడు ఏంటంటే..బలమైన సమాజ భావం,  దేశ సహజ సౌందర్యం, చేతితో తయారు చేసిన వస్త్రాలు. అంతేగాదు తన స్నేహితులు తరచుగా భారత్‌లోని సమాజ భావం గురించి చర్చిస్తారని, వాటి అంచనాల ఒత్తిడి అధికంగా ఉంటుందని వాళ్లంతా అంటుంటారని అన్నారామె. అయితే తాను దీన్ని పూర్తి చేసుకోలేనని, తాను అలా ఉండేలనని కూడా ఒప్పుకున్నారామె. అయితే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు ఆదరించుకుంటూ.. సహాయసహకారాలు అందించుకోవడం చూస్తుంటే..చాలా సంతోషంగా అనిపిస్తుందని అందామె. 

ఇది కుందేళ్లకు ఆహారం ఇచ్చేదాంతో పోల్చారామె. అదే సమయంలో తన స్వదేశం ఫ్రాన్సుకి కూడా దాని స్వంత ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయన్నారామె. అలాగే భారత్‌లో ప్రతి వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు. ఇక ఇక్కడ దుస్తులు ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటోంది. ఎంబ్రాయిడరీ, పూసల పనిలో ఉన్న నైపుణ్యం తనను ఆశ్చర్యపరుస్తాయిని అన్నారామె. 

తనకు ఇక్కడ కుర్తీలు కూడా అద్బుతంగా కనిపిస్తాయిని, అవి ఫ్రాన్స్‌లో హైఫ్యాషన్‌గా పరిగణిస్తారని, ఖరీదు కూడా ఎక్కువేనని తెలిపింది. చివరగా పోస్ట్‌లో భారత్‌లో బలాలుగా భావించిన వాటిని గురించి కూడా హైలెట్‌ చేశారామె. నెటిజన్లను ఈ పోస్ట్‌ అమితంగా ఆకర్షించడమే గాక, మా దేశంలో ఈవిషయాలను ఇష్టపడటం చాలా బాగుంది అంటు పోస్టులు పెట్టారు.

 

(చదవండి: పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!)

 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)