Breaking News

వెళ్లకోయి పరదేశీ..!

Published on Sat, 09/13/2025 - 01:26

అనుబంధాలు, ఆప్యాయతలకు భాష, సరిహద్దులతో పనిలేదు అని చెప్పడానికి ఈ వైరల్‌ వీడియో నిదర్శనం. విదేశీ పర్యాటకురాలిగా బెంగళూరుకు వచ్చిన అరీనా అక్కడే పదిహేను రోజులు ఉన్నది. ఆ రోజులు తనని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లాయి.

పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు రద్దీతో నిండిన మార్కెట్లు, పండగ ఉత్సవాలు, జాతరలు, కష్టజీవుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. ఈ క్రమంలో తనకు ఎంతోమంది పరిచయం అయ్యారు.

‘బెంగళూరులో పదిహేను రోజులు ఉన్న నేను ఈ దేశంతో పూర్తిగా ప్రేమలో పడిపోయాను. ఇండియా అనేది ఆధ్యాత్మిక శక్తితో కూడిన అద్భుతం దేశం’ అని తన పోస్ట్‌లో రాసింది అరీనా.

బెంగళూరులోని వైవిధ్య భరిత సాంస్కృతిక సౌరభాన్ని ప్రశంసించింది. ‘బెంగళూరు వీధుల్లో అలా నడుచుకుంటూ పోతే చాలు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ప్రతి మూల ఏదో ఒక ప్రత్యేకత కళ్లకు కడుతుంది’ అంటున్న అరీనా బెంగళూరులో ఉన్నన్ని రోజులు సంప్రదాయ దుస్తులే ధరించింది. మతసంబంధమైన కార్యక్రమాలు, ప్రార్థనలలో  పాల్గొనేది. ‘ఈ దేశాన్ని విడిచి వెళ్లాలంటే మనసుకు చాలా కష్టంగా ఉంది’ అని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది ఆరీనా.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)