Breaking News

ఎగిరే ఉడుతను చూశారా?

Published on Wed, 07/09/2025 - 17:02

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ పారికలలో అరుదైన ఉడుత మంగళవారం దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన పాంగి చందు అనే రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో ఉడుత ఎగురుతూ అటూ ఇటూ సంచరిస్తూ పొలంలో సందడి చేసింది. ఆ దృశ్యాన్ని చూస్తుండగానే ఒక్కసారిగా గాల్లోంచి కింద పడిపోయిందని, దగ్గరకెళ్లి చూస్తే ప్రాణం లేదని చందు తెలిపాడు. 

విశాలమైన రెక్కలు, పొడవాటి తోకతో చూడటానికి గబ్బిలంలా ఉందని, మునుపెన్నడూ ఇలాంటి రెక్కలున్న ఉడుత (Flying Squirrel) తారసపడలేదని రైతు తెలిపాడు.  

శివుడ్ని దర్శించుకున్న వానరం
పార్వతీపురం మ‌న్యం జిల్లా కేంద్రంలోని శ్రీసర్వమంగళాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోని శివుడిని మంగళవారం ఓ వానరం దర్శించుకుని తన భక్తిని చాటుకుంది. దీన్ని గమనించిన భక్తులు తమ సెల్‌ఫోన్లలో ఆ సన్నివేశాన్ని బంధించారు. ఆ వానరం (Monkey) శివలింగం వద్ద కొంత సమయం గడిపి అక్కడ ఉన్న ప్రసాదం స్వీకరించడాన్ని చూసిన భక్తులు పులకించారు.

కలియుగంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయని, ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశులు ఏదో రూపంలో తమ భక్తిని ప్రదర్శిస్తుంటాయని శ్రీవిద్యా సర్వమంగళా పీఠాధిపతి మురపాక కాళీదాసుశర్మ యాజీ తెలిపారు. 

చ‌ద‌వండి: ఉడుత‌లు కూడా ప‌గ‌బ‌డ‌తాయా?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)