Breaking News

మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైం జాబ్‌ నుంచి..ఫ్లయింగ్ ఆఫీసర్ రేంజ్‌కి..!

Published on Fri, 12/26/2025 - 16:41

సక్సెస్‌ అనేది ఎంతో కష్టపడి సాధించుకోవాల్సిందే. అలుపెరగని పోరాటం, కఠిన శ్రమ తోడు అయితే గానీ గెలుపుని పాదాక్రాంతం చేసుకోలేం. అంత కష్టపడ్డా ఒక్కోసారి దోబుచులాడి బాధపెడుతుంటుంది. ఓర్పుతో పోరాడితే ఓటమిని ఓడించి విజయాన్ని వశం చేసుకోగలం. అలా కష్టపడి శదేశానికి సేవ చేసే అత్యుతన్న హోదాని కైవసం చేసుకున్నాడు భవ్య షా. భవ్యమైన అతడి సక్సెస్‌ జర్నీ ఎలా సాగిందంటే..

భవ్య షా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అబ్బాయి. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే భాద్యతలు తీసుకుంది. పూణేలోని కళాశాలలో చదువుతున్నప్పుడే  మెక్‌డొనాల్డ్స్ కౌంటర్‌లో పార్ట్‌టైమ్ పనిచేసేవాడు. ఆ ఉద్యోగం అతడికి తనను తాను పోషించుకోవడం తోపాటు, క్రమశిక్షణ, సమయ నిర్వహణ, స్వతంత్రంగా వ్యవహరించడం వంటి విలువైన జీవిత పాఠాలను నేర్పింది. 

ఒకపక్క పార్ట్‌టైం ఉద్యోగం, మరోవైపు చదువు సాగిస్తున్నప్పుడే ఎదురయ్యే నిరుత్సాహాన్ని ఎలా బలంగా మార్చుకోవాలో నేర్చుకున్నాడు. చదువు, పనిని అంకితభావంతో చేస్తూనే..దేశానికి సేవ చేయాలనే తన డ్రీమ్‌ని అస్సలు మర్చిపోయేవాడు కాదు. ఆ తర్వాత నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), ఎయిర్ వింగ్‌లో చేరినప్పుడు భవ్య జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. NCC శిబిరాలు,  శిక్షణ ద్వారా, అతను క్రమశిక్షణా జీవితాన్ని అనుభవించాడు.

ఆ తర్వాత మైక్రోలైట్ ఫ్లయింగ్‌లో అనుభవం గడించాడు. ఆ అనుభవం భారత వైమానిక దళంలో పైలట్‌గా చేరాలనే లక్ష్యానికి నాంది పలికింది. అలా భవ్య షా సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB)కి ప్రిపరయ్యేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ క్రమంలో ఎన్నో తిరస్కరణలు, వైఫల్యాలు ఎదుర్కొనక తప్పలేదు. అయితే సాధించేంత వరకు ఆపేదే లే అన్నట్టు మరింత దృఢనిశ్చయంతో ఆ ఎగ్జామ్‌కి ప్రపేరయ్యాడు.

చివరికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో చేరినప్పుడు తన కల సఫలమైంది. శిక్షణ పొందిన కేవలం మూడు నెలలలోనే, భవ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరిట్ జాబితాలో స్థానం సంపాదించి IAF పైలట్ కావాలనే తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. ఏళ్ల తరబడి కృషి, సంకల్పం, సడలని ఆత్మవిశ్వాసంతో తన కలను సాకారం చేసుకుని స్ఫూర్తిగా నిలిచాడు భవ్యషా. 

అతడు సదా "తగ్డా రహో"(ఎల్లప్పుడూ బలంగా, ఆరోగ్యంగా ఉండటం)ని విశ్వసిస్తుంటాడు. ​కష్టాల్లో బలంగా, ప్రయత్నంలో స్థిరత్వం, శక్తివంతమైన ఆత్మవిశ్వాసమే గెలుపుని పాదాక్రాంతం చేసుకునే ఆయుధాలని తన విజయంతో చెప్పకనే చెప్పాడు భవ్యషా.

(చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గార్గ్‌..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)
 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం