బాబుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
ఇది అందరూ చూడగలిగే పువ్వు కాదు..!
Published on Wed, 04/08/2026 - 10:36
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. తనలో ఇముడ్చుకున్న కొన్ని విచిత్రాలు మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తాయి. అలాంటి అరుదైన పుష్పమే ఈ మంచుతామర లేదా మంచు కమలం. అందరికీ దీన్ని చూడటం సాధ్యం కాదు. ఈ మంచు కమలం ఎక్కడ వికసిస్తుందో తెలుసా..!.
ఈ మంచు పుష్పం ఐదు నుంచి ఎనమిదేళ్లు పెరిగి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుందట ఈ పర్వత పుష్పం. 'అరుదైన అందం', 'జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే క్షణం' వంటి పదాలు సరిపోతాయేమో ఈ మొక్కను వర్ణించడానికి. దీనిని సాసురియా ఇన్వోలుక్రాటా లేదా సాసురియా లానిసెప్స్ అని కూడా పిలుస్తారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే ఇది అందరు చూగలిగే పువ్వు కాదని అంటుంటారు.
చాలా ఏళ్లకు వికసించడం వల్లనే కాకుండా హిమాలయాలు, టియాన్‌షాన్ పర్వతాల్లో నివశించే కొద్దిమందికే ఈ మంచు కమలం గురించి తెలుస్తుందట. ఈ పుష్పం దాదాపు 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పెరుగుతుంది కాబట్టి ఇది తీవ్రమైన చలిలో కూడా జీవించగలదు. అరుదైనది అందమైనది మాత్రమే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగపడే ఔషధ గుణాలు కూడా ఉన్నాయట.
నిజానికి పదివేల కంటే ఎక్కువ ఎత్తులో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, పలుచని గాలి, తీవ్రమైన సూర్యరశ్మి వంటివి దీని మనుగడను కష్టతరం చేస్తాయి. ఆ సవాళ్లన్నింటిని తట్టుకుని పెరుగుతుంది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకం. పైగా ఈ మొక్క తన మనుగడతో గొప్ప జీవన పాఠమే గాక ఈ ప్రకృతిలో ప్రతిది కష్టాలను ఓర్చుకునే తన మనగడను చాటుకోవాల్సిందే అనే విషయం నొక్కి చెబుతోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి...!.
(చదవండి: ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!)
Tags : 1