Breaking News

ఐదేళ్ల చిన్నారికి కార్డియాక్‌ అరెస్టు..20 సెకన్ల పాటు..!

Published on Thu, 10/03/2024 - 10:00

యూఎస్‌లోని ఐదేళ్ల చిన్నారి కార్డియాక్‌ అరెస్టు గురై కుప్పకూలింది. దాదాపు 20 సెకన్లపాటు గుండె ఆగిపోయింది. అయితే ఆ బాలుడి బతుకుతాడో లేదో అన్న తీవ్ర ఉత్కంఠ రేగింది. ఈక్రమంలో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం మూడు వేర్వేరు ఆస్పత్రలు తరలించారు. అయితే ఆ బాలుడి అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపటడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఈ ఉత్కంఠభరితమైన ఘటన యూఎస్‌లోని థీమ్‌ పార్క్‌ వాల్డ్‌ డిస్నీ వరల్డ్‌లో చోటు చేసుకుంది. ఐదేళ్ల ఎర్నెస్టో టాగ్లే అనే చిన్నారి రోలర్‌కోస్టర్‌ను రైడ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతని వెనుక కూర్చొన్న ఆమెకు అతడి పల్స్‌లో ఏదో తేడా ఉన్నట్లు గమనించింది. వెంటనే ఛాతీపై తట్టడం వంటి సీఆర్‌పీ పనులు చేసింది అతడి తల్లి క్రిస్టీనా. ఆ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ ముగిసిన వెంటనే తన  కొడుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. 

ఆమె వెంట ఒక నర్సు, ఈఎంటీ మెషిన్‌ని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎర్నెస్టో దాదాపు 20 సెకన్ల పాటు శ్వాస పీలచ్చుకోవడం లేదు అంటే.. గుండె ఆగిపోయింది. దీంతో వాళ్లు గుండె మళ్లీ సక్రమంగా కొట్టుకునేలా ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్‌(ఈఎంటీ)ను అందించి హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆ బాలుడిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు  కాటెకోలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (సీపీవీటీ)తో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. 

ఇది అరుదైన గుండె పరిస్థితి. దీని కారణంగా సదరు రోగికి తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం లేదా లయ తప్పడం జరుగుతుంటుంది. ప్రాణాంతకమైన ఈ అరిథ్మియాలో వచ్చే ఆకస్మిక కార్డియాక్‌ అరెస్టుని నివారించేలా ఒక పరికరాన్ని అతడి ఛాతీలో ఉంచారు. అయితే అన్ని నిమిషాలపాటు శ్వాస ఆగిపోయిన టైంలో అతడి గుండె, మెదడు దెబ్బతినకుండా వైద్యులు రక్షించడం విశేషం. 

ఈ భయానక ఘటన నుంచి తన కొడుకు ఓ యోధుడిలా తిరిగొచ్చడాని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. అంతేగాదు తన కుమారుడిని కాపాడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. "ఆ చిన్నారి శక్తి అజేయం, భయానక పరిస్థితిని నుంచి బయటపడ్డ అద్భుత వ్యక్తి". అని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్‌ అవుతుందా..? రెండింటికి సంబంధం ఏంటీ..?)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)