Breaking News

ఆశల బల్లకట్టు

Published on Sun, 08/31/2025 - 06:07

ఓడించడానికి వరద వస్తుంది. మనిషిని ఓడగొట్టి చూద్దామని వరద వస్తుంది. వేయి చేతులతో లక్ష కాళ్లతో రాత్రికి రాత్రి... చీకటి దారిలో... దొంగదెబ్బ తీద్దామని వరద వస్తుంది. పగటి వేళ బందిపోటులా నీటితూటాల తుపాకీ పేలుస్తూ వరద వస్తుంది. అది ఇంటి పాదాల కిందుగా వస్తుంది. ఇంటి యజమాని తల మీదుగా వస్తుంది. 


చావిట్లోని ఎడ్ల కొమ్ముల మీద నుంచి, బరెగొడ్ల పొదుగుల మీద నుంచి, చంటి పిల్లల బెదురు ఏడుపుల మీద నుంచి, అమ్మ వెలిగించాల్సిన పొయ్యి మీద నుంచి, నాన్న జేబు మీద నుంచి భీతావహం చేస్తూ బీభత్సం సృష్టిస్తూ వస్తుంది. నేనెక్కువ అని ప్రకటించడానికి వస్తుంది. నెట్టుకుంటూ, తోసుకుంటూ, కూలగొడుతూ, పెళ్లగిస్తూ, కుళ్లగిస్తూ ప్రతాపం చూపించడానికి వస్తుంది.

ఈ దెబ్బతో మనిషి సఫా– అనుకుంటుంది అది. విర్రవీగుతుంది అది. ఉధృతంగా నవ్వుతుంది అది. అప్పటికి మనిషి సిద్ధమైపోయి ఉంటాడు. సరే... కొన్నాళ్లు అని నిర్ణయం తీసుకుని ఉంటాడు. భార్యాబిడ్డలను ఒడ్డుకు బయల్దేరదీస్తూ ఉంటాడు. మిగిలిన నూకలను మూటగట్టుకుంటూ ఉంటాడు. గొడ్డూ గోదాను తీసుకెళ్లేందుకు బల్లకట్టును వెతుకుతూ ఉంటాడు. 

మధ్య మధ్య భార్యను కేకేసి ‘ఇంటి ముందుకు నీళ్ల పిశాచి వచ్చింది... దానిక్కాస్త చీపురు చూపించు’ అని పురమాయిస్తుంటాడు. ఎన్ని చూసి ఉంటాడతడు? తుఫాన్లు కొత్తా? కుంభవృష్టి కొత్తా? వడగండ్లు కొత్తా? వడగాడ్పులు కొత్తా?  కరువు కొత్తా? బతుకు నెత్తిన పడేసే బరువు కొత్తా? రోగాలు.. రొష్టులు.. మహమ్మారులు.... పాలకుల నమ్మకద్రోహాలు... వ్యాపారుల నిలువు దోపిడీలు... డబ్బు రాజేసే పెను మంటలు... వరదకు భయపడతాడా? 

మనిషి ఆగడు. జీవితాన్ని ఆగనివ్వడు. ఆశను చావనివ్వడు. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. నాలుగు రోజులు ఉండి వెళ్లే అతిథికి తగిన మర్యాదలు చేసి పంపడం అతనికి వచ్చు. కష్టాలను మెల్లగా సాగనంపడం వచ్చు. వాటిని వదిలిపెట్టడం వదుల్చుకోవడం వచ్చు. అందుకు సాటి మనిషిని తోడు చేసుకోవడమూ వచ్చు. ఇది తెలియని వరద అతడిని జయించాలని చూసినప్పుడల్లా ఓడిపోయింది. మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంది. 

మహా అయితే సాధించగలిగేది కాసింత బురద జల్లి పోవడమే. మనిషి సాగించే అనంత జీవన ప్రయాణంలో వరదది లిప్తపాటు కలకలం. అతడు రేపో మర్నాడో మళ్లీ తన ఇల్లు చేరుతాడు. ఆరబెట్టిన వస్తువులు లోపల పెట్టుకుంటాడు.  తల స్నానం చేసి, పొడి బట్టలు కట్టుకుని, భార్య వండిన వేడి వేడి భోజనాన్ని పిల్లలతో పాటు భుజిస్తూ ఆశను ఊత చేసి సాగిపోతూనే ఉంటాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)