Breaking News

నో జిమ్‌.. నో డైటింగ్‌ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!

Published on Thu, 11/07/2024 - 15:43

ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్‌ హాట్‌ టాపిక్‌. అందుకే ఇన్‌ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్‌ లాస్‌ జర్నీలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్‌నెస్ ఇన్‌ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్‌ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో ఇది  వైరల్‌గా మారింది.

రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్‌ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్‌కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. 

నో ఫాస్ట్‌ఫుడ్‌, ఇంటి ఫుడ్డే ముద్దు
చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా,  చిక్కుళ్ళు ,  గింజధాన్యాలు,  తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు.

>

ఇంట్లోనే వ్యాయామం
జిమ్ మెంబర్‌షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది.  యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్‍తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.

కంటినిడా నిద్ర
ప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు  చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట.  ఇదే  బరువు తగ్గే  తన  ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది.  వాకింగ్‌  తన జర్నీలో పెద్ద  గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.

నోట్‌: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని,  నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్‌ చేసుకోవాలి. 
 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)