Breaking News

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్‌ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్‌' ఇవే..

Published on Thu, 07/03/2025 - 13:25

బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్‌ పాటించినా..ఒక్కోసారి చీట్‌ మీల్స్‌ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్‌ కోచ్‌ సామ్ ఎవెరింగ్‌హామ్. జస్ట్‌ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు.  మరి అవేంటో చూద్దామా..!

కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్‌లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్‌నెస్‌ కోచ్‌ సామ్‌. మరి అవేంటొ చూసేద్దామా..

పూల్‌మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలు

స్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలు

పుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలు

బ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలు

క్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలు

టమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలు

కీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలు

కాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలు

క్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలు

పైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలు

యాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలు

ఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలు

కొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలు

ఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలు

నిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలు

పాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలు

కాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలు

క్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలు

ప్రయోజనాలు..
వీటిలో ఎక్కువగా నీరు, పైబర్‌ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్‌ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. 

మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్‌నెస్‌  కోచ్‌ సామ్‌.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!)

 

 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)