Breaking News

ఇండియాలో తొలి మసీదు గురించి తెలుసా?

Published on Thu, 10/30/2025 - 16:41

క్రీ.శ. 629 (హిజ్రీ 7) సంవత్సరంలో నిర్మించబడిన చేరమాన్‌ జుమా మస్జిద్, కేవలం ఒక  ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; అది భారత ఉపఖండంలో మతసామరస్యానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు, సంస్కృతీ సంప్రదాయాల సంగమానికి అపుర్వమైన చిహ్నంగా నిలిచింది. మస్జిద్‌ నిర్మాణ శైలిలో ఆ కాలపు కేరళ శిల్ప సౌందర్యం ప్రతిబింబిస్తుంది. కానోపు (గుడార ఆకారం) ఆకారంలో కట్టిన గోపురం, కలపతో నిర్మించిన పైకప్పు, పురాతన సాంప్రదాయ నూనెదీపం – ఇవన్నీ దక్షిణ భారత ఆర్కిటెక్చర్‌కి ఇస్లామిక్‌ రూపాన్ని అద్దిన అరుదైన ఉదాహరణ. కాలక్రమేణా అనేక పునరుద్ధరణలు జరిగినా,  ప్రాథమిక రూపం చెక్కు చెదరకుండా కాపాడబడుతూ వస్తోంది. అక్కడి ఇమామ్‌లు ఇప్పటికీ తమ వంశావళిని మాలిక్‌ ఇబ్నె దినార్‌ వరకు కలిపి చెప్పుకుంటారు.

మస్జిద్‌ చతురస్ర ఆకారంలో పురాతన కళా వైభవాన్ని చాటుతోంది. మస్జిద్‌ కు సంబంధించిన కాంప్లెక్స్‌ లో చేరామన్‌ మ్యూజియం, వెనుక భాగంలో అందమైన కొలను, కుడి పక్కన ఖబ్రస్తాన్‌ , అందులో పచ్చని నిశ్శబ్దంతో తలలూపుతున్న కొబ్బరి చెట్లు, వివిధ రకాల మొక్కలు, కాలానికి అనుగుణంగా మార్పు చెందిన రాతి మెట్లు, మస్జిద్‌ లోపలి భాగం మధ్యలో వేలాడుతున్న పురాతన నూనెదీపం, అత్యంత సుందరమైన చెక్క మింబర్‌ ఇవన్నీ ఆ ప్రదేశాన్ని ఒక చరిత్రకావ్యంలా మార్చేశాయి.

అక్కడి స్థానికులు చెప్పిన ఒక మాట ప్రకారం ‘‘ఇది కేవలం మస్జిద్‌ కాదు, ఇది భారత దేశానికి ఇస్లాం ప్రవేశ ద్వారం.’’ఈ ఒక్క వాక్యంతో ఆ స్థలం  ప్రాముఖ్యత పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సముద్ర గాలిలోనూ, ప్రార్థన ధ్వనిలోనూ, ఆ భూమి ఇంకా చెరామాన్‌ పెరుమాళ్‌ ఆత్మను ఆత్మీయంగా మీటుతూనే ఉన్న అనుభూతి కలుగుతుంది. 
 – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)