Breaking News

మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం

Published on Tue, 10/28/2025 - 12:16

అబ్బుర పరిచే వింతలకు,  లగ్జరీ  భవనాలకు విశేషాలకు నిలయం సౌదీ అరేబియా. తాజాగా సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి "స్కై స్టేడియం" నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి  చేస్తోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్, ది లైన్‌లో భాగంగా 'నియోమ్ స్టేడియం' పేరుతో ఈ స్కై స్టేడియాన్ని నిర్మించనుంది.

సోషల్‌లో షేర్ అవుతున్న నివేదికల ప్రకారం 2034 FIFA  (FIFA World Cup 2034) ప్రపంచ కప్ కోసం మ్యాచ్‌లను నిర్వహించడానికి ఈ స్టేడియం 2027లో నిర్మాణాన్నిప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించననున్న  ఏ స్టేడియం 2034 ఫీఫా ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది.  46,000 మంది కూర్చోవచ్చట. 48-జట్ల టోర్నమెంట్‌ను నిర్వహించడానికి సౌదీ అరేబియా  నిర్వహించే గ్లోబల్‌ ఈవెంట్‌కు ఇది మరింత వన్నె తెస్తుందని అంచనా. 

మరోవై పుప్రపంచ కప్  నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందా అనేదానిపై చాలా మంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. 2017లో ప్రారంభించబడిన నియోమ్, ఇప్పటికే జాప్యాలు, లాజిస్టికల్ సవాళ్లు, మానవ హక్కులు మరియు పర్యావరణ సమస్యలపై  విమర్శలను ఎదుర్కొంది. అయితే దీనిపై సౌదీ అధికారులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నారు. ఇది సాకారం అయితే, స్కై స్టేడియం చరిత్రలో అత్యంత అద్భుతమైన క్రీడా వేదికలలో ఒకటిగా మారనుంది. ప్రపంచ వేదికపై సౌదీ అరేబియా రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి మచ్చుతునకగా మిగిపోనుంది.  కాగా 2034  ఫిఫా ప్రపంచ కప్‌  నిర్వహణకు బిడ్‌ సమర్పించిన ఏకైక దేశం  సౌదీ అరేబియా. ఇంతకు ముందు ఎన్నడూ లేని  నిర్వహించనున్న  ప్రపంచ కప్ ఈవెంట్‌లో ఇదే స్పెషల్‌  కానుందని భావిస్తున్నారు.  

 ఇదీ చదవండి: బిగ్‌బీ దివాలీ గిఫ్ట్‌ : నెట్టింట ట్రోలింగ్‌ మామూలుగా లేదుగా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)