'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ' : నటి లిసా రే

Published on Wed, 08/06/2025 - 11:29

‘నేను అత్యంత క్రమశిక్షణ కలిగిన మోడల్‌ను. కానీ దీని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన రీతిలో బ్లడ్‌ క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యింది. నేను ఐదు సంవత్సరాలు మించి బతకబోనని వైద్యులు చెప్పారు.. కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను బలంగా నిలిపింది. ఇప్పడు నేను 53 ఏళ్ల వయసులో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి, రచయిత లిసారే.  

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్‌ ఆఫ్‌ లిసా రే’ పేరిట బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఇంటరాక్టివ్‌ సెషన్‌ మంగళవారం జరిగింది. ఇందులో లిసా రే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా అత్యున్నత విజయ ఘడియ, నాకు అత్యంత చీకటి సమయంగా మారింది’ అంటూ ఆమె వాఖ్యానించారు. 

మన ఆరోగ్యానికి మనమే సీఈఓ అన్నారు. ‘బాధ్యత తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి’ అన్నారు. విజయం సమస్యలు పరిష్కరించదని, మన భావోద్వేగం ఆత్మవేదనను తొలగించబోదని అభిప్రాయపడ్డారు. సమాజం నిర్వచించిన విజయాన్ని తానే ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. లోపల నా భావాలు వేరుగా ఉండడంతో, నేను లోతుగా వెతకాల్సి వచ్చిందని చెప్పారు. 

రోగం అనేది దాచుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం కాదు.. నా శరీరం, నా జీవితం, నా వ్యాధి.. అన్నీ అంగీకరించడం వల్ల నాకు నిజమైన విముక్తి లభించిందన్నారు. ధ్యానం నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్లను శుభ్రం చేస్తాం.. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం.. కానీ మన మనసులోని నెగెటివ్‌ ఆలోచనలను ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. 

దేశం పరిపూర్ణం కాకపోయినా, జీవించడానికి ఇది ఉత్తమ స్థలమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమతోపాటు ఆహారాన్ని, ఇతర రంగాలన్నింటినీ నేను ప్రేమిస్తాను. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చైర్‌పర్సన్‌ ప్రతిభా కుందా తదితరులు పాల్గొన్నారు.   

(చదవండి: ఆ ఆ‍స్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..)

Videos

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)