Breaking News

నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు

Published on Fri, 07/25/2025 - 07:29

పనయ్యాక నాన్న ఇల్లు చేరుకుంటాడు. ఆ రోజంతటినీ ముగించి, ఆ రోజును అంతటితో చాలించి. ఉదయం వెళ్లేప్పుడు బయటకు చెప్పని హామీ ఇచ్చి వెళతాడు– సాయంత్రానికి ఇల్లు చేరుకుంటానని. మరి ఏం జరిగినా సరే... తుఫాను గొంతు చించుకున్నా సరే... భూమి నిట్ట నిలువునా చీలినా సరే... నాన్న... ఇల్లు చేరుకుంటాడు.

చీకటి పడితుంది... రాత్రి ఎనిమిదైపోతుంది... తొమ్మిదీ పదీ కూడా కావచ్చు... గ్రీజు మరకలు, ఆయిల్‌ వాసనా, గడ్డినూగు నస, చాక్‌పీస్‌పొడి రాలిన తల, గుండెన గుచ్చుకు వేళ్లాడుతున్న చీవాట్లు, ఆవేళ్టికి సరిపడా అవమానాలు, ఓవర్‌ డ్యూటీ ముఖము, కూచుని కూచుని పడి΄ోయిన నడుము... సరి చేసుకుని, సవరించుకుని... నాన్న... ఇల్లు చేరుకుంటాడు.

కొన్ని ద్రాక్షపళ్లు తెద్దామనుకుంటాడు. కాసింత మిఠాయి తీసుకెళ్లకుంటే ఎలా అనుకుంటాడు. అరటిపండ్లకూ ఇంటి సభ్యులకైతే జత సరిగ్గా కుదురుతుంది. మరునాడు పిల్లలు పెన్సిల్‌ కొనేందుకు చేయిపెడితే చిల్లర వరకైనా తగిలేలా జేబును భద్రం చేసుకుంటేగాని కదలడు. ఖాళీ జేబును భార్య అర్థం చేసుకుంటుంది. పిల్లలకు నాన్న జేబు ఎప్పుడూ హుండీయే.

నాన్న ఇల్లు చేరుకుంటాడు. దారిలో స్కూటర్‌ కుర్రాడు టక్కర్‌ ఇస్తే పడి, లేచి, ఎవరో ఇచ్చిన నీరు తాగి, మరేం పర్లేదని– నేరుగా ఇల్లు చేరుకుంటాడు. ఆ సంగతి ఎప్పటికీ ఇంట్లో చెప్పడు. పాత బాకీవాడు కూసిన నానా కూతలూ చెప్పడు. దగ్గరి బంధువొకరు గతిలేక గోజాడితే ఆ కాసింత సర్దుబాటు చేయలేనందుకు మనసున మూగెండ పట్టిందని ఎవరితోనైనా చెప్పగలడా ఏమి?

పని ఉంటేనే నాన్న సెలవు పెడతాడు. పని లేకున్నా పెట్టొచ్చని అంటే భయపడిపోతాడు. నాన్న ఇంటికి యజమానో... పాలేరో. నాన్నను ఆ రోజంతా నాన్న మనుషులు ఏమేమి అన్నారో ఎన్నెన్ని అనుకున్నారో... నాన్నకు చుట్టూ ఉన్న జనం ఏమేమి పేర్లు పెట్టారో... ఎన్నెన్ని బిరుదులిచ్చారో... మంచివారి మంచి వల్ల బతుకుతున్నాడో... చెడ్డవారి చెడ్డను ఎదుర్కొనేందుకు ఊపిరి తిరగేస్తున్నాడో...

ఇంటికొచ్చి నాలుగు మెతుకులు తిని నడుం వాల్చిన నాన్నను చూస్తే ఉదయం లేవడానికి పడుకున్నట్టు సాయంత్రం ఇల్లు చేరడానికి పడుకోనివ్వండన్నట్టు ఉంటాడు. నాన్న యుగాలుగా ఇల్లు చేరుకుంటున్నాడు. యుగాల పాటు ఇలాగే ఇల్లు చేరుకుంటాడు. ఆ రోజుకి కాసింత నవ్వాడో లేదో– ఇంటికొచ్చాక నవ్వేలా ఉంచగలమో లేదో–  మొత్తానికి నాన్న ఇల్లైతే చేరుకున్నాడు.
– ఖదీర్‌

(చదవండి: యువరాజ్‌ సింగ్‌ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్‌ డిజైన్‌ అదే అంటున్న యువీ!)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)