Breaking News

తండ్రి యూనిఫాంలోనే విధుల్లోకి లెఫ్టినెంట్ ఇనాయత్

Published on Mon, 03/11/2024 - 11:56

దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి మిలిటరీ యూనిఫాం ధరించి విధుల్లో చేరారు లెఫ్టినెంట్‌ ఇనాయత్‌ నాట్స్‌. సుమారు 20 ఏళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లో అసువులు బాసిన తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాననే సంకేతా లందించడం విశేషంగా నిలిచింది. కేవలం  మూడేళ్ల  వయస్సులో తండ్రిని కోల్పోయిన ఇనాయత్‌ తండ్రిపై ప్రేమను, అంతకుమించిన దేశభక్తిని చాటుకున్న క్షణాలు ఉద్వేగాన్ని నింపాయి. 

చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్  విభాగంలో లెఫ్టినెంట్‌గా ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి అక్కడున్న వారందరినీ ఆశ్యర్యపరిచారు.  ఆర్మీ డాటర్ లెఫ్టెనెంట్ ఇనాయత్ వాట్స్‌కు స్వాగతమంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. తండ్రి యూనిఫారం ధరించిన వాట్స్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. తల్లి శివాని వాట్స్ కూడా ఆమె పక్కన నిలబడి  ఉండడాన్ని ఈ ఫోటోలో  చూడవచ్చు.

కాగా ఛండిగఢ్‌కు చెందిన  నవ్‌నీత్ వాట్స్ 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో  విధులు నిర్వర్తించే వారు. 2003, నవంబర్‌లో శ్రీనగర్‌లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో నవ్‌నీత్‌ అమరుడయ్యారు. ఈ సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ నవ్‌నీత్ వాట్స్‌కు  కేంద్రం శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. ఇనాయత్ వాట్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో చేరారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)