AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..
Breaking News
విడాకుల మహోత్సవం
Published on Sat, 06/01/2024 - 08:04
‘మా అమ్మాయి పెళ్లి’ అని చెప్పడానికి సంతోషించే తల్లిదండ్రులు విడాకుల విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి అనిల్ కుమార్ మాత్రం ‘నరకప్రాయమైన సంసారం కంటే విడాకులే సో బెటర్’ అంటున్నాడు.
అనిల్ అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం రకరకాల బాధలకు గురి చేస్తుంటే తట్టుకోలేక అనిల్ కుమార్తె ఉర్వీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. బ్యాండ్ బాజాలతో నిర్వహించిన ఉర్వీ విడాకుల మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది.
Kanpur man celebrates his daughter's divorce, brings her home with Band-Baja.
అత్తారింట్లో వేధింపులు తాళలేక ఎన్ని సార్లు పేరెంట్స్‌కి చెప్పినా "సంసారమన్నాక ఇవన్నీ మామూలే" అని సముదాయిస్తూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకూ తీసుకెళ్ళేది తల్లిదండ్రులే! తమ కూతురికి కష్టం వస్తే ఓదార్చి… pic.twitter.com/lZAaVk9Mly— Harish R.M (@27stories_) May 1, 2024
Tags : 1