Breaking News

లావాటి చిరుతపులి..! బరువు తగ్గించడానికి నానా ప్రయత్నాలు!! చివరికీ..

Published on Sun, 06/23/2024 - 05:03

చిరుతపులులు సాధారణంగా సన్నగా ఉంటాయి. పెద్దపులులు, సింహాలతో పోల్చుకుంటే, వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవి శరవేగంగా దూకి వేటాడగలవు. చిరుతపులుల సహజమైన తీరుకు భిన్నంగా చైనాలోని ఒక జూలో ఉన్న పదహారేళ్ల చిరుతపులి బాగా లావెక్కిపోయి, ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ చిరుత ఫొటోలు చూసి, ఇది చిరుతలా కనిపించడం లేదని, సముద్ర జంతువు సీల్‌లా ఉందని కొందరు వ్యాఖ్యలు చేశారు. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ పాంఝిహువా పార్క్‌ జూలో ఉన్న ఈ లావాటి చిరుత మిగిలిన చిరుతల్లా చురుగ్గా కాకుండా, మందకొడిగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈ ఏడాది మార్చిలో వైరల్‌గా మారాయి.

ఇది డిస్నీ కామిక్‌ సిరీస్‌లోని లావాటి పోలీసు పాత్ర ‘క్లాహాసర్‌’ను తలపిస్తోందంటూ కొందరు వెటకారం చేశారు. జంతుప్రేమికులు మాత్రం అడ్డగోలుగా లావెక్కిన ఈ చిరుత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. సాధారణంగా చిరుతపులుల బరువు దాదాపు పాతిక నుంచి ముప్పయి కిలోల వరకు ఉంటుంది. ఈ చిరుత మాత్రం రెట్టింపు బరువు పెరిగింది.

దీని గురించి ఆన్‌లైన్‌లో అలజడి మొదలవడంతో చైనా జూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, దీని బరువు తగ్గించడానికి నానా ప్రయత్నాలు ప్రారంభించారు. మేత తగ్గించడం, వ్యాయామాలు చేయించడానికి ప్రయత్నించడం సహా రెండు నెలలకుపైగా ఎన్ని తంటాలు పడినా ఈ చిరుత ఏమాత్రం బరువు తగ్గకపోవడంతో అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు.

ఇవి చదవండి: కీకారణ్యంలో.. మాయన్‌ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే?
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)