Breaking News

బీపీ ఉంటే ఆవేశపడరు..ఆవేశ పడటం వల్లే అది..

Published on Sat, 07/15/2023 - 10:06

రక్తపోటు ముప్పు తప్పుతుంది ఇలా...నేటి ఆధునిక జీవన శైలి కారణంగా న్నపిల్లలనుం పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉరుకులు, పరుగులు... ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలే. ఫలితంగా వయసుతో నిమిత్త లేకుండా రక్తపోటు పెరిగిపోతుంటుంది. హై బీపీ అనేక రోగాలకు ఆలవాలం. వచ్చాక బాధపడే కంటే రాకుండా నివారించుకోవడం మేలు. అందువల్ల అధిక రక్తపోటును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం...చాలామంది అపొహ ఏమిటంటే ఎవరైనా ఇతరులమీద ఆవేశ పడుతుంటే, కేకలు వేస్తుంటే అదంతా బీపీ వల్ల అనుకుంటారు. అయితే అది తప్పు. బీపీ ఉండటం వల్ల ఆవేశపడరు. ఆవేశపడటం వల్ల బీపీ పెరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

  • ముందుగా ఆహారపదార్థాలలో రక్తాన్ని ఉద్రేకపరిచే పదార్థాలను నిషేధించాలి.
  • ఆహారంలో వాడే ప్చమిర్చి బదులు ఎండుమిర్చిని... క్రమంగా దాని బదులు కారపు రుచికోసం మిరియాలను ఉపయోగించాలి. అంటే మిరియాల చారు, మిరియాల కారం ఇలాంటివన్నమాట.
  • మనం వాడే రాళ్ల ఉప్పు గాని, షాపుల్లో దొరికే (అయోడైజ్‌డ్‌ సాల్ట్‌తో సహా) ఇతర ఉప్పుల బదులు సైంధవ లవణం వాడటం మంది.
  • అదేవిధంగా పులుపు కోసం కొత్త చింతపండుకు బదులు పాతచింతపండు లేదా దేశవాళీ టమాటాలు ఉపయోగించడం శ్రేయస్కరం.
  • గడ్డ పెరుగుకు బదులు పలుచని మజ్జిగ మంచిది. ఎందుకంటే, ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ పేగుల్లో విషపదార్థాలు లేకుండా ఉదరంలో పిత్తరసం ప్రకోపించకుండా రక్తపోటు పెరగకుండా కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
  • షాపుల్లో దొరికే స్వీట్లకు బదులు ఇంట్లో పాతబెల్లంతో చేసుకున్న తీపిని వాడుతుంటే ఎలాంటి ప్రమాదం రాదు. కూరల తయారీలో వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, అల్లం, జీలకర్ర, ధనియాలు, మిరియాలను ఉపయోగించడం ఆరోగ్యకరం.
  • ఉదయం 9.30 గంటల లోపు, రాత్రి 7.30 గంటలలోపు తినడం ముగించాలి.
  • రాత్రిపూట కప్పు నీటిలో చెంచా మెంతులు వేసి మూత పెట్టి ఉదయం బ్రష్‌ చేసుకోగానే ఆ నానబెట్టిన మెంతులను నమిలి తినాలి. మెంతులు నానబెట్టిన ఆ నీటిని కూడా తాగాలి.
  • ఒక పచ్చి ఉల్లిపాయను ముక్కలుగా తరిగి కూరన్నంతో, మజ్జిగన్నంతోనూ కలిపి తింటుంటే క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది.

(చదవండి: 'రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు)

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు