Breaking News

ఆదర్శ వనిత.. అద్భుత ప్రతిభ

Published on Tue, 07/07/2026 - 09:48

తూర్పుగోదావరి: అందం, చదువు, ఆటలు.. ఈ మూడింటిలో దూసుకుపోతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నిహారిక. ఇంజినీరింగ్‌ సెకండియర్‌ చదువుతూ, సివిల్ సర్వీసెస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పాశర్లపూడిలంకకు చెందిన తెలగారెడ్డి నిహారిక కుటుంబం ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడింది. గ్రామ దేవత చింతాలమ్మ జాతరకు స్వగ్రామం వచ్చిన నిహారిక తన అభిరుచులు, లక్ష్యాలను సోమవారం స్థానిక మీడియా ప్రతినిధులకు వివరించారు.

 



బహుముఖ ప్రజ్ఞ 
నిహారిక సౌందర్య పోటీల వేదికపై భారతీయ ముద్దుగుమ్మగా మెరిసింది. శాస్త్రీయ నృత్య వేదికలపై ఆధ్యాత్మిక ఘనతను చాటింది. క్రీడా మైదానంలో బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌గా దూసుకుపోతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశ, విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న నిహారిక బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతోంది.  

విజయాల ప్రస్థానం... 
మిస్‌ టీన్‌ గార్జియస్‌ ఆఫ్‌ ఇండియా విజేతగా జాతీయ స్థాయిలో నిహారిక గుర్తింపు పొందింది. మిస్‌ ఉత్తరాంధ్రగా ప్రాంతీయ కిరీటం, మిస్‌ బ్రైడ్స్‌ ఆఫ్‌ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. మిస్‌ వైజాగ్‌ గ్లోబ్‌ పోటీల్లో టాప్‌–5లో నిలిచి అత్యంత ప్రతిభ చాటింది. భారతీయ సంప్రదాయ కళలను గుండెల్లో నింపుకొన్న ఆమె.. చక్కని శాస్త్రీయ నృత్య కారిణిగా రాణిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాశీ, తిరుపతితో పాటు ఎన్నో దేవస్థానాల వేదికలపై అనేక ప్రదర్శనలు ఇచ్చింది.

ప్రధాని మోదీ ప్రశంసలు 
కళలు, క్రీడలు, చదువులో నిహారిక చూపిస్తున్న అసాధారణ ప్రతిభను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన అంబేడ్కర్‌ జయంతిలో ప్రధాని చేతుల మీదుగా అభినందనలు అందుకుంది.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)