Breaking News

పువ్వుల డిజైనర్‌వేర్‌లో స్టైలిష్‌గా కనిపిద్దాం ఇలా..!

Published on Fri, 06/13/2025 - 10:27

పువ్వులకు మగువలకు విడదీయరాని బంధం ఉంటుంది. పువ్వులను తమ భుజాల మీదుగా మణికట్టు వరకు అలంకరించుకుని అందంగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్‌ గౌన్లలో విరివిగా కనిపించే ఈ స్టైలు ఇప్పుడు ఎల్లలు దాటి మన సంప్రదాయ డిజైనర్‌ వేర్‌లోనూ కనువిందు చేస్తోంది. ఫ్యాబ్రిక్‌తో పువ్వులు వచ్చేలా కుట్టడం ఈ స్టైల్‌ ప్రత్యేకత. ఇక పువ్వులు చేతుల్లో కాదు, చేతులకు అందంగా అలంకరించుకోవచ్చు.

పింక్, పీచ్‌ కలర్‌ బ్లౌజ్‌ అయితే ఫెమినైన్‌ లుక్,  రెడ్‌ కలర్‌ అయితే స్టేట్‌మెంట్‌ అటైర్‌గా, తెలుపు, గోధుమరంగు అయితే వేదికలపైన పల్లకీ లుక్‌తో కనిపిస్తారు. ఏ స్టైల్‌లో కనిపించాలనుకుంటే ఆ డ్రెస్సింగ్‌కి సరిగ్గా నప్పే ఈ గులాబీల గుచ్చాలు ప్రత్యేకంగా కనిపించడమే కాదు, ఫొటోలలోనూ విలాసంగా ఉంటుందనే ఆలోచన కూడా దీనికి క్రేజ్‌ పెంచుతోంది. నిన్నటి వరకు పిల్లల డ్రెస్సింగ్‌లో కనిపించే ఈ స్టైల్‌ పెద్దవారి చీరకట్టుకూ అందాన్ని తీసుకువచ్చింది. రిసెప్షన్, సంగీత్‌.. వంటి వేడుకలలో గ్రాండ్‌గా వెలుగుతోంది.

  • స్లీవ్స్‌ డిజైన్‌ బోల్డ్‌గా ఉంటే, నెక్‌ సింపుల్‌గా ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఆభరణాలు కాకుండా సన్నని చైన్లు వాడచ్చు.

  • గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌజ్‌ స్లీవ్స్‌ డిజైన్‌ చేయడం ఈ స్టైల్‌ స్పెషల్‌. ఈ పువ్వులు లేయర్లుగా మంచి ఫ్లేర్‌ వచ్చేలా డిజైన్‌ చేస్తారు. వీటిని ఎక్కువగా నెట్, ఆర్గాంజా, షిఫాన్‌ వంటి ఫ్యాబ్రిక్స్‌తో తయారు చేస్తారు.

  • ఇండో వెస్టర్న్‌ డ్రెస్సుల్లో, ఫ్యూజన్‌ గౌన్లు, క్రాప్‌ టాప్‌ + స్కర్ట్‌ లుక్,  పెప్లం టాప్స్, షరారా, పలాజో సెట్‌లలో విరివిగా కనిపిస్తున్నాయి.

  • సంప్రదాయ డ్రెస్సులకు రెండు వైపులా ఫ్యాబ్రిక్‌ గులాబీల కుచ్చు ఉంటే, వెస్ట్రన్‌ స్టైల్స్‌లో బ్లౌజ్‌ లేదా గౌన్‌కు, సింగిల్‌ షోల్డర్‌ ఫ్రాక్‌కి ఒకవైపు గులాబీ గుచ్చం కనువిందు చేస్తుంది.

  • శారీ లేదా లెహంగా కూడా సింగిల్‌ షోల్డర్‌ రోజ్‌ బొకేని డిజైన్‌ చేయించుకోవచ్చు.

  • శారీ బ్లౌజ్‌ ట్రెండ్‌లలో గులాబీ స్లీవ్స్‌ అందంగా అమరిపోతున్నాయి.

  • రోజ్‌ స్లీవ్స్‌ ఎంచుకున్నప్పుడు జుట్టును పోనీటైల్‌ లేదా బన్‌ స్టైల్‌ వేసుకుంటే డ్రెస్సింగ్‌ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

  • హై నెక్‌ టాప్‌ అయితే డ్యూయల్‌ రోజ్‌ స్లీవ్స్‌ బాగుంటాయి.  

(చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్‌ వరల్డ్‌ 2025లో..)

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి