Breaking News

దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

Published on Sat, 05/03/2025 - 16:10

ఫుడ్‌ బిజినెస్‌కు  ఎపుడూ మంచి డిమాండ్‌ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే  రుచిగా ఉంటుంది.  మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో.  బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్‌ బిజినెస్‌లో రాణిస్తున్నవారు చాలా మంది  ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు  తెలుగు రాష్ట్రానికి  చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ  తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్‌ సక్సెస్‌ గురించి తెలుసుకుందాం.

చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన  సుధీర్  మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై  మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో  అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా  అతని సంపాదన నెలకు 7 లక్షల  రూపాయలు.

ఇదీ చదవండి: నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా

ఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే  కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ  వారి చేయూత నందించడం విశేషం.

అయితే  ది మిల్లెట్ మ్యాన్ సుధీర్‌ సక్సెస్‌ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు.  ప్రారంభంలో చాలా  కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు.  అతనికి సంకల్పానికి  కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్‌ విశాఖపట్నంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్‌లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్‌ స్టాల్‌ను సందర్శించారు కూడా. 

ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)