Breaking News

ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్‌

Published on Mon, 04/28/2025 - 17:11

ఆధునికయుగం, స్మార్ట్‌ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలో కూడా  ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే  ఉంది.   ఆడబిడ్డ మహాలక్ష్మీగా భావించే  సమాజమే  ఆడబిడ్డను భారంగా భావిస్తుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఆడశిశువులను భారంగా భావిస్తున్నారు.  అవును మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును ఆసుపత్రిలోనే వదిలివేసిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. దీనికి సంబంధించిన ఘటనను ఒక మహిళా వైద్యురాలు షేర్‌  చేయడంతో ఇది  వైరల్‌గా మారింది.

చదవండి: అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లా

మహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ తన మూడవ కుమార్తెకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడ శిశువు జన్మించడంతో నిరాశ చెందిన ఆ కుటుంబం, నవజాత శిశువును ఆసుపత్రిలోనే వదిలివేసింది.  ప్రసవం తర్వాత శిశువు తండ్రి కూడా ఆమెను సందర్శించలేదని డాక్టర్ వెల్లడించారు.

సోషల్ మీడియాలో డాక్టర్‌ భావోద్వేగ విజ్ఞప్తి
21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ కొనసాగుతున్న, లోతుగా పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె హైలైట్ చేశారు. దేశ అధ్యక్షురాలు మహిళ, ఇటీవల అంతరిక్షంనుంచి   ఎంతో ధైర్యంతో తిరిగి వచ్చిన   సునీతా విలియమ్స్  మహిళ. ఇలాంటి వారిట భారతదేశం ఎంత గర్వపడాలి.ఆడ శిశువును ఎలా తిరస్కరించడం అన్యాయం,ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని అంటూ ఆవేదన  వ్యక్తం చేశారు. 

ఈ వీడియో  క్షణాల్లో వైరల్ అయ్యింది దీనిపై నెటిజనులు  స్పందించారు.  ఈ ఘటనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా,  మరికొందరు తాము దతత్త తీసుకుంటామన్నారు. ఆమెను ప్రేమతో నిండిని గూడును అందించడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో శిశువు కుటుంబం తమ తప్పును గ్రహించారు. తిరిగి తమ బిడ్డను తీసుకెళ్లారు.  ఈ విషయాన్ని ఆ డాక్టర్ తరువాత ఒక ఫాలో-అప్ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియా వల్లే ఆ ఫ్యామిలి తమ తప్పు తెలుసుకుంది అంటూ ఆమె  నెటిజన్లకు  కృతజ్ఞతలు తెలిపారు.  ఆ పాప  కుటుంబ సభ్యులను వివరాలను మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.

ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)