Breaking News

తీవ్రమైన మోకాలి నొప్పిని వ్యాయామాలతో జయించింది..!

Published on Tue, 02/24/2026 - 16:59

హాంకాంగ్‌కు చెందని కవితా బిశ్వాస్‌ టీచింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం చేస్తుండేవారు. పూర్తికాల ఉద్యోగం తోపాటు యోగా, నృత్య సాధనతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవతం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఆకస్మత్తుగా నలభైల మధ్యలో మోకాలి నొప్పి బారిన పడింది దాంతో ఆమె లైఫ్‌ఎంతో ఘెరంగా మారిపోయిందంటే..మళ్లీ నడుస్తానన్న ఆశ ఆవిరైపోయింది. కానీ ఆమె ఆ సమస్యను ఎలాంటి మోకాలి ఆపరేషన్‌ చేయించుకోకుండానే జయించింది. పట్టుదలతో అనారోగ్య సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే..ఏ సమస్య అయినే ఇట్టే మాయం అయిపోతుందనడానికి ఆమె ఉదంతమే ఉదాహరణ. 

హాంకాంగ్‌ పాఠశాలలో టీచర్‌గా సాగిస్తున్న కవితా బిశ్వాస్‌  జీవితాన్ని మోకాలి నొప్పి..ఆమె జీవితాన్ని చాలా దుర్భరంగా మార్చేసింది. భరించలేని నొప్పి, నడక కష్టమై ఎక్కడకు వెళ్లలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది. కనీసం ఓ పదినిమిషాలు నడవాలంటే ప్రాణమే పోయేంత పరిస్థితి. చివరికి కర్ర సాయం లేకుండా నాలుగు అడుగులు కూడా వేయలేని దారుణమైన పరిస్థితికి చేరిపోయింది. ఆఖరికి ఎయిర్‌పోర్ట్‌లో సైతం వీల్‌చైర్‌ ఆధారం తీసుకోవాల్సి వచ్చిందామెకు. ఆమె ట్రీట్‌మెంట్‌ కోసం భారత్‌కు వచ్చారు. ఇక్కడి వైద్యులు మోకాలి లిగమెంట్‌ దెబ్బతిందని, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స తప్పదని చెప్పారు. 

అయితే ఆమె వయసు ఈ చికిత్సకు అర్హమైనది కాకపోవడంతో..మందులు, వ్యాయామాలను కొనసాగించి చూడమని సూచించారు. దాంతో తిరిగి హాంకాంగ్‌ వచ్చేశారు. ఇక ఎప్పటిలా తనకు తానుగా స్కూల్‌కి, నృత్యసాధన సాధ్యం కాదని అర్థమైపోయింది కవితకి దాంతో ఫిజియోథెరపీ తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారామె. ఓపక్కన  చికిత్స తీసుకుంటూనే..చిన్నగా నడవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేసింది. మోకాలి వంచలేదని తెలుసు కానీ..వర్కౌట్లు చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా అయిపోతుందని అలానే బాధనంతటిని పట్టి బిగువున అదిమపట్టి చేస్తుండేది.  గోడ ఆధారిత వ్యాయామాలు, రెసిస్టెన్స్ బ్యాండ్‌లు సాయంతో కండరాలు బలోపేతం చేసే కొద్దిపాటి వ్యాయామాలు చేస్తుండేది. 

అలాగే ఆహారంలో మార్పులు చేసుకుని 92 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకుది. సుమారు 18 నెలల తర్వాత, కర్ర సాయం లేకుండా తనంతట తానుగ నడవగలిగింది. అంతేగాదు సుమారు 45 నిమిషాల వరకు నడవగలగడంతో..మళ్లీ నా స్వతంత్ర వచ్చింది అంటూ సంబరపడిందామె. ఇక్కడ కవిత తన నొప్పి, వాపులకు అనుగుణంగా వ్యాయామాలు చేసుకునేలా సర్దుబాటు చేసుకుంది. అలా ఈ సమస్య నుంచి బయపటపడే ప్రయత్నం చేసింది. 

అంతేగాదు ఈ మహిళ అనుభవం..మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌ను నిర్వహించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తేటతెల్లం అయ్యింది. మూడేళ్ల క్రితం కవిత ఎయిర్‌పోర్టుకి వీల్‌చైర్‌పై వస్తే..ఇపు​డు ఆమె ధీమాగా నడుచుకుంటూ వెళ్లింది. ఆ మహిళ స్టోరీ..ఏ అనారోగ్య సమస్య అయినా..ధైర్యంగా ఉండి వైద్యనిపుణుల సాయం తీసుకుంటే..సులభంగా బయటపడొచ్చని చెప్పకనే చెబుతోంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)