Breaking News

ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!

Published on Sun, 08/24/2025 - 14:39

ఈ రోజుల్లో ప్రేమ అనే పదం కనుమరుగైపోతోంది. పచ్చని సంసారాలు చిన్న చిన్న అపార్థాలతో భగ్గుమంటున్నాయి. అలాంటి తరుణంలో కొన్ని ప్రేమకథలు వింటుంటే..అలాంటి ప్రేమలు ఇప్పుడెందుకు ఉండటం లేదు అనిపిస్తోంది. అలాంటి భావోద్వేగభరిత లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.

అదేంటంటే..భారత మాజీ ఆర్మీ అదికారి కెప్టెన్‌ ధర్మవీర్‌ సింగ్‌ తన ప్రియురాలు రాసిన లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె అతడి అర్థాంగి. తాను 2001 ఆ టైంలో చెన్నైలో ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో చేరినప్పుడు రాసిన లవ్‌లెటర్‌ అని చెప్పుకొచ్చారు. తన స్నేహితురాలైన ఠాకురైన్‌  ఆ ప్రేమలేఖ రాసినట్లు వివరించారు. 

అయితే సైనిక అకాడమీలో లెటర్‌లు మావద్దకు చేరాలంటే సీనియర్లు పెట్టే షరతులను, టెస్ట్‌లను అంగీకరించాల్సి వచ్చేది. అయితే తనకు వచ్చిన లేఖ చాలా బరువుగా ఉందంటూ తన సీనియర్లు తన చేత ఏకంగా 500 పుష్‌అప్‌లు చేయాలని బలవంతం పెట్టారట. దాంతో చేసేదేమి లేఖ అన్ని పుష్‌అప్‌లు చేయక తప్పలేదని చెప్పుకొచ్చారు. తాను అకాడమీలో ఉండగా అందుకున్న మొదటి లేఖ అదేనట. 

రాయడానికి ఎంత టైం పట్టిందో గానీ, ఆ భావాలు తన మనసులో ఇంకా అలానే పదిలంగా ఉన్నాయంటూ ఆ లేఖ తాలుకా వీడియోని జత చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నెటిజన్లు ఆ వీడియోని చూసి ఆమెది చాలా అందమైన చేతిరాత, మీ ప్రేమ కథ హృదయాన్నిదోచే గొప్ప ప్రేమకథ అని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు.

 

(చదవండి: ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!)

 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)