ప్రతి మహిళా సెలిబ్రిటీనే : మిసెస్‌ ఇండియా తెలంగాణ మిటాలీ

Published on Mon, 02/24/2025 - 15:33

సాక్షి, సిటీబ్యూరో : ఇటీవల మిసెస్‌ ఇండియా తెలంగాణ క్రౌన్‌ విజేతగా నిలవడం సంతోషంగా ఉందని మిసెస్‌ మిటాలీ అగర్వాల్‌ తెలిపారు. సెపె్టంబర్‌లో జరగనున్న మిసెస్‌ ఇండియా ఫ్యాషన్‌లో పాల్గొంటానని, ఈ పోటీల్లోనూ విజేతగా నిలవడానికి సన్నద్ధమవుతున్నానని ఆమె తెలిపారు. నగరంలోని కూకట్‌పల్లి వేదికగా వనితల కోసం ఏర్పాటు చేసిన విరజ ఫ్రిల్స్‌ ఉమెన్స్‌ వేర్‌ స్టోర్‌ను ఆదివారం ప్రారంభించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం అభినందనీయమన్నారు.

సాధికారతతో మహిళా దినోత్సవాన్ని జరుపుకునే ప్రతి మహిళా ఒక సెలిబ్రిటీనే అని మిటాలీ అన్నారు. విరజ ఫ్రిల్స్‌ వేదికగా స్మార్ట్‌ క్యాజువల్స్, బిజినెస్‌ క్యాజువల్స్‌తో పాటు మహిళల సరికొత్త స్టయిల్‌ కోసం లేటెస్ట్‌ ట్రేడింగ్‌ కలెక్షన్‌అందుబాటులో ఉందని నిర్వాహకులు అనుషా నామా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మిసెస్‌ మిటాలీ అధునాతన వ్రస్తాలంకరణతో అలరించారు. 

చదవండి: చందాకొచ్చర్‌ న్యూ జర్నీ: కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
మూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!
 

ఆకట్టుకుంటున్న  టోపోగ్రఫీ  
బంజారాహిల్స్‌: రోడ్‌ నెం.10లోని సృష్టి ఆర్ట్‌ గ్యాలరీలో అంతర్జాతీయ చిత్ర కళాకారులతో పాటు భారతీయ కళాకారుడు, టోపోగ్రఫీస్‌ ఆఫ్‌ టెంట్స్‌ టెర్రకోట అండ్‌ స్టైమ్‌ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శన ఔత్సాహిక కళాకారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సృష్టి ఆర్ట్‌ గ్యాలరీ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గోతేజంత్రం భాగస్వామ్యంతో టోపోగ్రఫీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. జర్మనీకి చెందిన ప్రముఖ చిత్రకళాకారుడు ఆర్నాల్డో డ్రెస్‌ గోన్జాలెజ్, స్వెన్‌ కహ్లర్ట్‌తో పాటు భారతీయ చిత్రకారుడు సుధాకర్‌ చిప్పా వేసిన పెయింటింగ్స్‌ ప్రదర్శనకు ఉంచారు. విభిన్న కళాత్మక భాషలు, జీవిత అనుభవాలను ఈ చిత్రాల్లో కళ్లకు కట్టారు. నెలా 15 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 50కి పైగా సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు ఆలోచనాత్మక రీతిలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)