Breaking News

ఇంటి వేడుకలు చుట్టూ ఇంతుల విజయ విహారం..!

Published on Tue, 06/17/2025 - 10:46

చారిత్రక వైభవాన్ని సమకాలీన ఆధునికతను సమపాళ్లలో కలుపుకుని, విభిన్న రకాల వేడుకలకు నిలయంగా మారిన  నగరంలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో మహిళలు చెప్పుకోదగిన విధంగా రాణిస్తున్నారు. మొదట ఈ రంగంలో పురుషాధిపత్యం కనిపించినా, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. తమదైన సృజనాత్మకత, అర్థవంతమైన నిర్వహణ, డీటెయిల్డ్‌ ప్లానింగ్‌తో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. 

సీఏ నుంచి ఈవెంట్స్‌ వరకూ.. 
చార్టెడ్‌ అకౌంటెంట్‌గా చేస్తూ దానిని వదిలేసి, అనుకోకుండా కోవిడ్‌ సమయంలో ఈ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పటికి 500కి పైగా ఈవెంట్స్‌ ఆర్గనైజ్‌ చేశాను. మహిళలు ప్రతి ఒక్కరితో సులభంగా కలిసిపోతారు. అందుకే రాణించగలుగుతున్నారు. ప్రస్తుతం పుట్టినరోజులు, శారీ సెర్మనీలు, షష్టిపూర్తి..వరకూ ప్రతి వేడుకకీ మహిళలే సారథ్యం వహిస్తున్నారు. 
– నిహారిక, శ్రీ వర్ణం

ఉద్యోగం కన్నా ఉన్నతంగా.. 
యుక్తవయసు నుంచీ మెహిందీ అంటే ఇష్టం. మా ఊరు నుంచి నగరానికి వచ్చాక ఎమ్మెస్సీ చదువుతూ పార్ట్‌ టైమ్‌ జాబ్‌ కోసం అన్వేషిస్తున్నప్పుడు ఈ ఆర్ట్‌ ద్వారా ఆదాయం గురించి తెలిసింది. అలా పార్ట్‌ టైమ్‌ ఆర్టిస్ట్‌గా.. ఆ తర్వాత ఫుల్‌ టైమ్‌ ఆర్టిస్ట్‌గా మారాను. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో కంటిన్యూ చేస్తున్నాను. మెహందీతో పాటు నెయిల్‌ ఆర్ట్‌ కూడా  నేర్చుకున్నాను. నెలలో 15రోజులు పనిచేసినా చాలు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కన్నా ఎక్కువే వస్తుంది.  
– శ్వేత గన్నోజు, మెహందీ ఆర్టిస్ట్‌  

అందం.. అందరికీ.. 
ఇంటర్‌తో చదువు అటకెక్కింది. భర్త ప్రోత్సాహంతో ప్రొఫెషనల్‌గా నేర్చుకుని మేకప్‌ సేవలు అందిస్తున్నాను. బర్త్‌డే, ప్రీ వెడ్డింగ్‌ షూట్స్, సంగీత్‌ ఇలా ప్రతి వేడుకకూ మేకప్‌ అవసరం. ఇంట్లో ఫంక్షన్‌ ఉందంటే ఆ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ మేకప్‌ కావాలంటున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ రంగంలో పలువురు యువతకు శిక్షణ అందిస్తున్నా.  
– భవానీ నవీన్, మేకప్‌ ఆర్టిస్ట్‌

సమన్వయమే.. ‘సంగీత్‌’కి న్యాయం.. 
చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ బాగా చేసేదాన్ని. డ్యాన్స్‌ పోటీల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగానే ఈ రంగంలోకి వచ్చేశా. దీంతో ఎనిమిదేళ్ల నుంచి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నా. ఈ రంగంలో రాణించాలంటే సహనం ఉండాలి. మనకు వచి్చనట్టు, నచ్చినట్టు కాదు అతిథుల బాడీ లాంగ్వేజ్‌ బట్టి నేర్పించాలి.  
– శ్రీవాణి, కొరియోగ్రాఫర్‌ 

వెడ్డింగ్‌ ప్లాన్‌ చేయడం ఒకెత్తయితే సంగీత్, మెహందీ, హల్దీ, రిసెప్షన్‌ వరకూ పెళ్లిలో భాగమైన కార్యక్రమాలన్నింట్లో మహిళల పాత్రే కీలకం. గత కొన్నేళ్లుగా ట్రెండీగా మారిన డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ నిర్వహణా బాధ్యతల్ని సైతం మహిళలు చేపట్టడం విశేషం. ఫ్లోరల్‌ డెకరేషన్, టేబుల్‌ సెట్టింగ్స్, బ్యూటీ, కాంపాక్ట్‌ స్టేజింగ్‌ వంటివి పండించడంలో మహిళలకు సహజంగా ఉండే సున్నితత్వం ఉపకరిస్తోంది. 

‘సంగీత్‌’ వారధి.. నృత్యానికి సారధి 
నాట్యం, సంగీతం, డ్రామా కలగలిపిన మ్యూజికల్‌ ఫెస్టివల్‌ సంగీత్‌ ప్రోగ్రామ్‌. నృత్యం వచ్చిన, రాని, అంతంత మాత్రమే చేయగలిగిన ప్రతి ఒక్కరినీ సమన్వయపరచి సంగీత్‌ని రక్తి కట్టించే కొరియోగ్రాఫర్‌ అనే కీలకపాత్రలో మహిళలు సునాయాసంగా ఒదిగిపోతున్నారు. 

సంప్రదాయంగా నాట్యం నేర్పడంలో ఉండే సమర్థత, శ్రద్ధ, సమయ పాలన వీటన్నింటికీ మించి కుటుంబంతో మమేకమైపోయే నేర్పు.. ఈ పాత్రలో మహిళలకు తిరుగులేని ఎంపిక. సాంగ్‌ సెలక్షన్‌ నుంచి స్టెప్పుల ఎంపిక వరకూ అంతా తామై వ్యవహరిస్తున్నారు. 

మాటే మంత్రం.. 
ఫ్యామిలీ ఈవెంట్స్‌లో బంధుమిత్రుల్ని భాగస్వాములుగా చేసే పలు కార్యక్రమాలను నడిపించే కంపేరర్లుగా కూడా మహిళలు సాటిలేని రీతిలో రాణిస్తున్నారు. భాషాపరంగా నైపుణ్యం, హాస్య చతురత, కలుపుగోలు తనంతో కంపేరింగ్‌ క్వీన్స్‌గా మారిపోతున్నారు. ఇంగ్లిష్‌–తెలుగు మిక్స్‌తో సహజంగా మాట్లాడే వీరి శైలి ఆకట్టుకుంటోంది. 

చిన్నితెరపై యాంకర్స్‌గా ఎలాగైతే దుమ్ము రేపుతున్నారో.. అలాగే వినోద భరిత కార్యక్రమాల్లోనూ కంపేరర్స్‌గా నగరంలో సత్తా చాటుతున్నారు. తాను ఆర్జేగా ప్రారంభమైనా వివాహ వేడుకలతో పాటు బేబీ షవర్స్, కార్పొరేట్‌ ఈవెంట్స్‌లో కంపేరర్‌గా స్థిరపడడానికి కారణం అందులో అవకాశాలు, ఆదాయం బాగుండడమేనని నగరానికి చెందిన పూజిత  అంటున్నారు.  

(చదవండి: ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్‌ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది)

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)