Breaking News

‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!

Published on Sat, 03/14/2026 - 07:43

కొందరు పెద్దలు సంప్రదాయంలో భాగమంటూ ‘ఉగ్గు’ పేరుతో పసిపిల్లల నాలుకకు తేనె రాస్తుంటారు. ఈ కార్యాన్ని శుభసూచికగా చెబుతారు. అయితే ముద్దులొలికే పసిపాపలకు  అందించే ఆ ఒక్క తేనె చుక్క వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐర్లాండ్‌లోని అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నిపుణులు డాక్టర్ సురేష్ సి పిళ్ళై చిన్నారులకు తేనె పెట్టడం వలన కలిగే ప్రాణంతక ముప్పును తెలియజెప్పారు.

జపాన్ చిన్నారి మరణంతో వెలుగులోకి..
గత కొంతకాలంగా పసిబిడ్డలకు తేనె పెట్టడంతో కలిగే ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2017లో టోక్యోలో జరిగిన ఒక విషాద ఘటన ఈ నాటికీ వెంటాడుతోంది. నాడు ఆరు నెలల వయసున్న చిన్నారికి తేనె కలిపిన ఆహారాన్ని ఇవ్వగా, ఆ పసిపాప ‘ఇన్ఫాంట్ బోటులిజం’ బారిన పడి మృతి చెందింది. తేనెలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా  కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్య పరీక్షల్లో తేలింది.

శరీరం మొద్దుబారిపోయేలా చేసి..
అప్పటి నుంచి జపాన్ సహా పలు దేశాలు ఏడాదిలోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదనే కఠిన నిబంధనను అమలు చేస్తున్నాయి. తేనెలో 'క్లోస్ట్రిడియం బోటులినమ్' అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఏళ్ల తరబడి సజీవంగా ఉంటుంది. ఏడాదిలోపు చిన్నారుల జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో, ఈ ప్రమాదకర బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశించి, విషతుల్యమైన 'బోటులినమ్ టాక్సిన్'ను విడుదల చేస్తుంది. ఇది నేరుగా బిడ్డ నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, శరీరం మొద్దుబారిపోయేలా చేస్తుంది.

పెద్దలకు లేని ముప్పు.. పిల్లలకే ఎందుకు?
తేనెను పెద్దలు తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెద్దవారి జీర్ణాశయంలో ఉండే శక్తివంతమైన ఆమ్లాలు, ఇతర బ్యాక్టీరియాలు ఈ బోటులినమ్ మూలాలను నిర్వీర్యం చేస్తాయి. అయితే పసిపిల్లల విషయంలో ఇలా జరగదు. అందుకే అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ (ఎఫ్‌డీఏ) వంటి సంస్థలు సైతం ఏడాది దాటే వరకు పిల్లలకు కనీసం ఒక్క తేనె చుక్క కూడా ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నాయి.

పాత అలవాట్లకు స్వస్తి పలకాల్సిందే!
సంప్రదాయం పేరిట గర్భవతులు, బాలింతలు లేదా పసిబిడ్డలకు తేనెను రుచి చూపించడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల నిల్వలో తేడా వచ్చినా లేదా కలుషితమైన క్యాన్డ్ ఫుడ్ తిన్నా పెద్దల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గత ఏడాది ఇటలీలో జరిగిన ఒక ఘటనలో ఇలాంటి విషతుల్యమైన ఆహారం తిని ఒకరు మరణించగా, మరో తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. అందుకే సహజసిద్ధమైన ఆహారమైనప్పటికీ పసిపిల్లల విషయంలో తేనె అత్యంత ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)