Breaking News

ఎవల్యూషన్‌ డే’ని జరుపుకొందాం!

Published on Mon, 02/17/2025 - 13:48

ఇంగ్లిష్‌ నేచురలిస్ట్‌ ఛార్లెస్‌ డార్విన్‌ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని  ప్రకటించిన రోజు 1859 నవంబర్‌ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవ ల్యూషన్‌ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకొంటున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మన దేశంలో కూడా జరపడం అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలహీనపడుతోంది.  జీవ పరిణామ సిద్ధాంతం (థియరీ ఆఫ్‌ ఎవొల్యూ షన్‌) పనికిరానిదని మాట్లాడే రోజులొచ్చాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతి శీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. 

‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ధ్యానిస్తూ కళ్ళు మూసు కోవడం కాదు, నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు అన్నది తెలుసుకుంటే, నీ కళ్ళు తెరు చుకుంటాయి. ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి? ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాంతా నికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునేవారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్‌ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు.

అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లోగానీ, పౌర సమాజాల్లోగానీ, కుటుంబాల్లోగానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తు న్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్స్‌ కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతులైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని దేశంలోకొనసాగుతున్న విషమ పరిస్థి తులను అర్థం చేసుకుని, ఎక్క డికక్కడ ఎవరికి వారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. వట్టి ఆలోచన లతో పని జరగదు. వాటిని ఆచ రణలో పెట్టాలి. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మరింతగాఉంది. విద్యార్థులకు జీవ పరి ణామంపై, డార్విన్‌పై సంద ర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావి భారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధ పెట్టాలి. వారిని హేతుబద్ధంగా ఆలోచింప జేయాలి. మానవ వాదులుగా తీర్చిదిద్దు కోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొ కరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి.

– డా. దేవరాజు మహారాజు
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, బయాలజీ ప్రొఫెసర్‌‘

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)