Breaking News

ఉన్నది ఒకటే అన్న భావనే అద్వైతం

Published on Thu, 06/05/2025 - 10:50

ద్వైతం కానిది అద్వైతం. అంటే రెండు అనే భావన పోయి ఉన్నది ఒకటే అని భావించగలగటం అద్వైతమవుతుంది. అయితే ఉపాధులన్నీ సమానమని అర్థం కాదు. పాపపుణ్య కర్మ ఫలితంగా వచ్చిన ఉపాధులు పరస్పరం భిన్నమైనవే. అవి పూర్తిగా నశించిపోయేవే. నశించనిది, నిత్యసత్యమైనది ఉపాధి గతమైన ఆత్మ ఒక్కటే. ఈ విషయం గ్రహించటమే సమదర్శి స్వభావం.  

నిత్యసత్యం, వ్యవహార సత్యం అనేవి రెండున్నాయని గ్రహించాలి. మనకు కనబడే ప్రపంచమంతా వ్యవహారంలో సత్యం. కాని నిత్యసత్యము మాత్రం కాదు. ప్రపంచం నిత్యసత్యమని తెలిస్తే అది భ్రాంతి అనక తప్పదు. ఈ అద్వైత జ్ఞానం వల్ల తానంటూ వేరే ఉండక అంతట తననే చూడటం, తనలోనే సర్వాన్ని చూడటం జరుగుతుంది. ‘ఆత్మ వత్సర్వభూతాని సర్వభూతాని చాత్మని’  అనే దాని కర్థం అదే. ఈ జ్ఞానం ఒక్క గురుబోధ, గురుసేవ వల్లనే లభ్యం. కేవలం గ్రంథ పఠనం చాలదు.

ఒక గురువు గారు తన శిష్యుడికి ‘అద్వైతం’ గురించి పాఠం ప్రారంభించారు. ‘భగవంతుడు ఒకడే. ఆయన సర్వాంతర్యామి. ఆయన సంకల్పంతో సృష్టి జరిగింది. ఆయనొక్కడే నిత్య సత్యం. ఈ కనబడేది అంతా భ్రాంతి వల్ల కనబడు తున్నది కాని నిజానికి ఇదేదీ లేదు. అని మొదట్లో బోధించటం జరిగింది. ఈ జ్ఞానం శిష్యులలో స్థిరపడటానికి ఇంకా సమయం కావాలి.  గురువిచ్చే అనుభవం సంపాదించాలి. అప్పుడుగాని అర్థమైనట్లు కాదు. ప్రాథమిక దశలోనే ఉన్న ఈ శిష్యుడు ఒక సారి అడవికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. దారిలో ఒక మదపుటేనుగు ఎదురుగా వస్తున్నది. దానిపై ఉన్న మావటివాడు,  ఈ ఏనుగు ఇది పూర్తిగా మచ్చిక కాని మదపుటేనుగు పక్కకు తప్పుకో అని అరిచాడు. ఆ శిష్యునికి అద్వైతం పాఠం గుర్తుకొచ్చింది. ‘ఈ కనబడేదంతా బ్రహ్మమే. రెండవదంటూ లేదు.’ కాబట్టి ఈ కన బడే ఏనుగు భ్రాంతి జన్యమైంది. కనుక నేను తప్పుకోవలసిన పని లేదని ముందుకు నడిచాడు. ఏనుగు రానే వచ్చింది, తొండంతో అతణ్ణి విసిరి అవతల పారవేసింది. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందో లేదో కాని మనకు మాత్రం బాగా అర్థమవ్వాల్సింది ఏమిటంటే... ‘ఉపాధులన్నింటిలోనూ ఉన్న అంతర్యామి ఆత్మ ఒక్కటే అయినా, ఉపాధి గత భేదం భేదమే’అని!

#

Tags : 1

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)