Breaking News

ఈ 5 ప్రదేశాలకు మీరు ఎప్పటికీ వెళ్లలేరు!

Published on Mon, 07/27/2026 - 12:47

ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు గూగుల్‌లో కనిపిస్తాయి, డాక్యుమెంటరీల్లో ఉంటాయి. కానీ రియల్‌ లైఫ్‌లో ఈ ప్రదేశాలకు డైరక్టుగా వెళ్లడం దాదాపు అసాధ్యం. కొన్ని ప్రదేశాలను వాటి నేచర్‌ని ప్రొటెక్ట్‌ చేయడానికి, కొన్ని తెగల గిరిజనుల మనుగడను కాపాడేందుకు, మరికొన్ని ప్రాంతాను మిలిటరీ రహస్యాల వల్ల సాధారణ ప్రజలకు దూరంగా ఉంచారు. మరి ఆ మిస్టరీ ప్రదేశాలు ఇవే..

నార్త్‌ సెంటినల్‌ ఐలాండ్‌
భారతదేశంలో ఉన్న అండమాన్‌ ద్వీప సమూహంలో ఈ చిన్న ద్వీపంలోనికి బయటి ప్రపంచం నుంచి ఎవరూ వెళ్లేందుకు అనుమతి లేదు. ఇక్కడ సెంటినెలీజ్‌ అనే ప్రపంచంతో సంబంధం లేని ప్రజలు ఉంటారు. వాళ్లను అంటువ్యాధుల నుంచి దూరంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఈ ఐలాండ్‌ చుట్టూ స్ట్రిక్ట్‌గా నో–ఎంట్రీ జోన్‌ మెయింటైన్‌ చేస్తోంది.

ఏరియా 51
ఏలియెన్స్‌ ఉన్నారా? సీక్రెట్‌ వెపన్స్‌ తయారు చేస్తున్నారా? ఇలాంటి ఎన్నో పుకార్లకు కేరాఫ్‌ చిరునామాగా మారింది అమెరికాలోని ఏరియా 51 అనే ప్రాంతం. నిజం ఏంటి అనే విషయం కాస్త పక్కన పెడితేం ఇది అమెరికా మిలిటరీకి చెందిన హై–సెక్యూరిటీ జోన్‌ లేదా బేస్‌. సాధారణ ప్రజలు ఇక్కడికి వెళ్లడం పూర్తిగా నిషేధం.

స్వాల్‌బార్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌
దీనినే ప్రపంచ బ్యాకప్‌ లాకర్‌ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో లక్షలాది మొక్కల విత్తనాలను సంరక్షిస్తారు. భవిష్యత్తులో ఏదైనా తెలియని విపత్తు వచ్చినా కూడా వ్యవసాయం మళ్లీ ప్రారంభించేందుకు ఇది ప్రపంచానికి ఇన్సూరెన్స్‌ పాలసీలా పని చేస్తుంది. అందుకే సాధారణ ప్రజలను ఇక్కడికి వెళ్లేందుకు అనుమతించరు.

లాస్కాక్స్‌
17,000 ఏళ్ల నాటి పురాతనమైన పెయింటింగ్స్‌ ఉన్న ఈ గుహల్లోకి ఒకప్పుడు సందర్శకులు వెళ్లేవారు. అయితే కాల క్రమేన మనుషుల శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రత, బయటి ప్రపంచం నుంచి వచ్చే కాలుష్యం వల్ల పెయింటింగ్స్‌కు డ్యామేజ్‌ అవ్వడం మొదలైంది.దీంతో కంప్లీట్‌గా పర్యాటకులను బ్యాన్‌ చేసేశారు.

వాటికన్‌ సీక్రెట్‌ ఆర్కైవ్స్‌
శతాబ్దాల నాటి పురాతనమైన, అత్యంత రహస్యాత్మక డాక్యుమెంట్స్, రాజపత్రాలు, చారిత్రాత్మక రికార్డులు అన్నీ కూడా ఇక్కడే దాచి పెడతారు. ప్రత్యేక అనుమతి తీసుకుని వెళ్లే పరిశోధకులకు త΄్పా ఇతరులకు ఎవరికీ ఇక్కడికి వెళ్లేందుకు పర్మిషన్‌ లభించదు.

నిజానికి ప్రతీ అందమైన ప్రదేశం మనం విజిట్‌ చేయడానికి కాదు. కొన్ని ప్రదేశాలకు రహస్యమే అందం. ఇలా సీక్రెట్‌గా ఉండటం వల్లే వాటి ప్రత్యేకత అలాగే కంటిన్యూ అవుతుంది. ట్రావెల్‌ అంటే చెక్‌లిస్ట్‌ పూర్తి చేయడం కాదుం వెళ్లిన ప్రతీ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను గౌరవించడం. అలాగే వెళ్లకూడని ప్రదేశాలను అలా ఏకాంతంగా వదిలేయడం కూడా వాటిని గౌరవించడమే అవుతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)