Breaking News

Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..

Published on Mon, 06/02/2025 - 06:00

ఓపల్‌ సుచాతా.. మోడల్, థాయ్‌లాండ్‌.. తొలి మిస్‌ వరల్డ్‌... ఇప్పుడు 72వ మిస్‌ వరల్డ్‌! థాయ్‌లాండ్‌కి చెందిన ఆమె కేన్సర్‌ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్‌ ట్యూమర్‌ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్‌ సుచాతా గురించి మరిన్ని విషయాలు  ఆమె మాటల్లోనే..

‘‘నేను పుట్టి పెరిగింది థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో. మా ఊరూ హైదరాబాద్‌లాగే పర్ల్‌ సిటీ! హైస్కూల్‌ కోసం బ్యాంకాక్‌కి మూవ్‌ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్‌. ప్రస్తుతం నేను అంబాసిడర్‌ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్ చదువుతున్నాను..  మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్‌ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్‌ విమెన్  మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. 

ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్‌లో డిటెక్ట్‌ అయిన ట్యూమర్‌తో ఫైట్‌ చేసేలా చేసింది. అది క్యాన్సర్‌ ట్యూమర్‌ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్‌ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్నెస్‌ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. 

దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ప్రాజెక్ట్‌తో బ్రెస్ట్‌క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్ ను స్టార్ట్‌ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్‌లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ అనే రౌండ్‌తో ఈ మిస్‌ వరల్డ్‌ బ్యూటీ పాజెంట్‌ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్‌లో పాల్గొన్నాను. నా కథను షేర్‌ చేసుకుని, నాప్రాజెక్ట్‌ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మీద మహిళలకే కాదు జెండర్స్‌కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.

తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటాను
మిస్‌ వరల్డ్‌ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.

క్రౌన్‌తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉంది
నా బ్యూటీ పాజెంట్‌ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్‌ బ్యూటీ  పాజెంట్‌లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్‌ వరల్డ్‌కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌తో విన్  అయ్యి.. మిస్‌ వరల్డ్‌ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్‌ వరల్డ్‌ క్రౌన్‌తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్‌ నా లెర్నింగ్‌ అన్  లెర్నింగ్‌ప్రాసెస్‌కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్‌ షేరింగ్‌తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్  బ్రాడ్‌ అయింది.

అన్నీ అద్భుతం
తెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్‌గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్‌ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్  జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్‌ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్‌ వరల్డ్‌.

– సరస్వతి రమ
ఫొటోలు: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)