Breaking News

దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!

Published on Mon, 02/12/2024 - 10:42

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే ఒకనొక ఇంటర్వ్యూలో ఈమా దత్షి రెసిపీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. నిజానికి ఈమా దత్షీ రెసిపీ భూటాన్‌ వంటకం. తన అభిమానులకు ఈ వంటకం గురించి షేర్‌ చేశారు దీపికా. ఈ రెసిపీ రుచి, తయరీ విధానాల గురించి పంచుకున్నారు. గతేడాది దీపికా ఏప్రిల్‌ 2023లో భూటాన్‌ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ ప్రత్యేక భూటాన్‌ వంటకంపై మనసు పారేసుకున్నానని, ఇప్పుడది తన ఫేవరెట్‌ డిష్‌ అని చెప్పుకొచ్చారు ఆమె. ఇంతకీ ఏంటా ఈమా దత్షి రెసిపీ. ఏ కూరగాయాలకు సంబంధించిన వంటకం అంటే..

ఈమా దత్షి అనేధి భూటాన్‌ జాతీయ వంటకం.దీన్ని పచ్చి ఎర్ర మిరపకాయలు, చీజ్‌, మిరియాలు, ఉల్లిపాయలు, టొమాటోలతో కలిపి చేసే ఒక విధమైన రెసిపీ. దీన్ని లంచ్‌ లేదా డిన్నర్‌ టైంలో కర్రీగా తినదగిన రెసిపీ. దీన్ని ఎవ్వరైనా పదినిమిషాల్లో ఈజీగా ప్రిపేర్‌ చేసుకుని ఆస్వాదించొచ్చు. 

ఎలా చేయాలంటే...?
టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌, మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నల్ల మిరియాలు తదితర పదార్థాలన్నింటిని తీసుకుని వాటిపై కాస్త నూనె పొయ్యండి. పాన్‌లో ఒక కప్పు నీరు పోసి పదార్థాలను బాగా కలపి పెద్దమంటపై ఉంచండి. అలాగే పాన్‌పై మూత పెట్టండి. వేడిని ఎక్కువ పెంచి పది నిమిషాలు ఉడకనివ్వండి. కూరగాయాలు ఉడికన తర్వాత మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది. వెంటనే స్టవ్‌ని మీడియంలో పెట్టి.. కాస్త నెయ్యి, కొద్దిగా చీజ్‌,  కొద్దిగా మసాల వంటివి కూడా వెయ్యండి. అంతే ఈమా దత్షి రెడీ. ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. జొంగ్ఖా భాషలో ఈమా అంటే మిరపకాయ. ఇక దట్షి అంటే చీజ్‌ అని అర్థం. వాటితో చేసే రెసిపీ కాబట్టి దీన్ని 'ఈమా దత్షి' అని పిలుస్తారు భూటాన్‌ వాసులు. 

(చదవండి: స్టన్నింగ్‌ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)