Breaking News

అలాంటి ప్రేమనే కదా అంతా కోరుకునేది..!

Published on Wed, 09/03/2025 - 18:16

ఇవాళ ఆలుమగల మధ్య ఉన్న ప్రేమ అనే పదం దారుణంగా అపహస్యం పాలవుతోంది. పెళ్లి అనే పదం కూడా భయాందోళనలు కలిగించేలా మారిపోయింది. అంతలా అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈరోజుల్లో అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ ఒకటి తారసపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతా కోరుకునేది ఇలాంటి ప్రేమనే కదా అంటున్నారు నెటిజన్లు.

అయినా ప్రేమించడానికి, ప్రేమించబడటానికి కూడా అదృష్టం ఉండాలేమో..!. సంపాదన ఏదో రకంగా ఆర్జించొచ్చు. ఒక మనిషి ప్రేమను పొందడం, నిలబెట్టుకోవడం రెండూ అంత ఈజీ కాదు. పైగా ఈ రోజుల్లో అలాంటి ప్రేమనేది మచ్చకైనా కానరాని పరిస్థితి. 

కానీ ఈ వృద్ధ జంట "ప్రేమ అంటే ఎప్పటికీ ప్రేమే" జీవితాంతం అగ్నికంటే స్వచ్ఛంగా ఉంటుంది అని తమ చేతలతో చెప్పారు.జిష్మా ఉన్నికృష్ణన్‌ అనే సోషల్‌ మీడియా వినియోగదారుడు నెట్టింట అందుకు సంబంధించిన వీడియోని షేర్‌చేశారు.

ఆ వీడియోలో ఒక వృద్ధుడు తన భార్య కాలికి పట్టీలు పెట్టుకోవడంలో ఇబ్బందిపడుతుంటే గమనిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అతను ఆమెకు సహాయం చేసిన తీరు అచ్చం సినిమాలోని హీరో హీరోయిన్లను తలపించేలా ఉంది. అతడు నిజంగా తన భార్యకు సాయం చేసిన తీరు సినిమాలోని సీను మాదిరిగా అత్యంత యాదృచికంగా కనిపించింది.

ఆ అపూర్వ క్షణాన్ని చూసిన సోషల్‌ మీడియా వినయోగదారురాలు ఉన్నికృష్ణన్‌కి ఒక్కసారిగా రైలులో ప్రయాణిస్తున్నట్లు అనిపించలేదు. జీవితాంత ప్రేమించడం అనే మాటకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నట్లు అనిపించిందట. 

అందుకే ఆయన వీడియోకి ఓ మధురమైన క్షణంలో జీవితాంతం ప్రేమించడాన్ని చూశాను అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఆ వీడియోని పోస్ట్‌ చేశారు. అంతేగాదు ఆ వీడియోని చూసి నెటిజన్లు కూడా అంతా అలాంటి ప్రేమనే కదా ఆశించేది అంటూ ఉద్వేగభరితంగా పోస్టులు పెట్టారు.

 

(చదవండి: అందువల్లే భారత్‌కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?)

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)