Breaking News

ఇకపై జీన్స్‌కి బ్రేక్‌! ఇదే న్యూ ట్రెండ్‌!!

Published on Sun, 07/12/2026 - 13:14

‘అల్మరాలో పది ప్యాంట్లు ఉన్నా... చేతికి వచ్చేది మాత్రం అదే జీన్స్‌!’ చాలామంది అబ్బాయిల కథ ఇదే. ఆఫీస్‌ అయినా... డేట్‌ అయినా... పార్టీ అయినా... ‘జీన్స్‌ వేసుకుంటే సేఫ్‌!’ అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి... అదే కంఫర్ట్‌తో, ఇంకా క్లాసీగా కనిపించే మరో ఆప్షన్‌  ఉంటే? అవే ఇవీ!

డ్రాస్ట్రింగ్‌ ట్రౌజర్స్‌
ఎలాస్టిక్‌ వెయిస్ట్, డ్రాస్ట్రింగ్‌తో వచ్చే ఈ ట్రౌజర్స్‌ కంఫర్ట్‌లో నెంబర్‌ వన్‌ . జాగర్స్‌లా హాయిగా, లుక్‌లో క్లాస్‌ ఉంటాయి.

వైడ్‌ లెగ్‌ ట్రౌజర్స్‌
ఈ మధ్య ఫ్యాషన్‌  ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న స్టయిల్‌ ఇదే. కాస్త లూజ్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉంటాయి. ఓవర్‌సైజ్‌ టీ–షర్ట్‌ లేదా క్యాజువల్‌ షర్ట్‌తో వేసుకుంటే ట్రెండీ లుక్‌ గ్యారంటీ.

స్టయిలింగ్‌ సపోర్ట్‌ ముఖ్యం!
ట్రౌజర్స్‌ వేసుకుంటే సరిపోదు, వాటిని ఎలా స్టయిల్‌ చేస్తారన్నదే అసలు మ్యాజిక్‌! ఫైవ్‌ పాకెట్‌ ట్రౌజర్స్‌తో సాదా టీ–షర్ట్, స్నీకర్స్‌తోనూ, ప్లీటెడ్‌ ట్రౌజర్స్‌కు టక్‌–ఇన్‌  షర్ట్, లోఫర్స్‌ అయితే రిచ్‌ లుక్‌ గ్యారంటీ. లినెన్‌  ట్రౌజర్స్‌ను హాఫ్‌ స్లీవ్‌ షర్ట్‌తో మ్యాచ్‌ చేస్తే సమ్మర్‌లో కూల్‌గా కనిపిస్తారు. డ్రాస్ట్రింగ్‌ ట్రౌజర్స్‌కు ఓవర్‌సైజ్‌ టీ–షర్ట్ట్‌ పెయిర్‌ చేస్తే ట్రెండీ లుక్‌ మీ సొంతం. ప్రతిరోజూ అదే జీన్స్‌ వేసుకుని ‘నా దగ్గర ఇంకో ప్యాంట్‌ లేదా?‘ అని అల్మారానే అడిగే పరిస్థితి వద్దు. ఒక్కో సందర్భానికి ఒక్కో ట్రౌజర్‌ ఎంచుకుని, దానికి తగ్గ టాప్, షూస్‌ను మ్యాచ్‌ చేస్తే... అప్పుడు మీ స్టయిల్‌తో పాటు మీ ఫోటోలు కూడా అప్‌గ్రేడ్‌ అవుతాయి.

  • ఫైవ్‌ పాకెట్‌ ట్రౌజర్స్‌!: జీన్స్‌కు దగ్గరి బంధువుల్లా కనిపిస్తాయి. పాకెట్లు, ఫిట్‌ అన్నీ జీన్స్‌లాగే ఉంటాయి. కానీ లుక్‌ మాత్రం మరింత షార్ప్‌. ఆఫీస్‌ నుంచి పార్టీ వరకు ఎక్కడైనా సెట్‌.

  • చినో ట్రౌజర్స్‌: ‘తక్కువ హంగామా... ఎక్కువ క్లాస్‌!’ అనాలంటే ఇవే. టీ–షర్ట్‌తో వేసుకున్నా బాగుంటాయి... షర్ట్‌తో వేసుకున్నా సూపర్‌. ప్రతి అబ్బాయి వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ప్యాంట్‌ ఇదే.

  • ప్లీటెడ్‌ ట్రౌజర్స్‌: ఒకప్పుడు నాన్నల ఫ్యాషన్‌ ... ఇప్పుడు ట్రెండ్‌ సెట్టర్స్‌ ఫేవరెట్‌! ముందు ఉండే ప్లీట్స్‌ వల్ల లుక్‌కు చిన్న రాచరిక టచ్‌ వస్తుంది. కంఫర్ట్‌ కూడా అదిరిపోతుంది.

  • లినెన్‌  ట్రౌజర్స్‌: ఎండాకాలానికి అసలు హీరో ఇవే! తేలికగా ఉంటాయి, గాలి బాగా ఆడుతుంది. బీచ్‌ వెకేషన్‌ , బ్రంచ్‌ డేట్, సమ్మర్‌ పార్టీ... ఎక్కడైనా కూల్‌గా కనిపిస్తారు.
    - కొండి దీపిక

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)