Breaking News

ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!

Published on Wed, 02/19/2025 - 18:15

ట్రక్‌లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది. 

అసలేం జరిగిందంటే..నాగ్‌పూర్‌ బుల్ధానా జిల్లాలోని సింద్‌ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్‌నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. 

అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్‌. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్‌పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది.  కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే.  అందువల్లే పవార్‌ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్‌. 

తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్‌. ఇక తాను ఈ ట్రక్‌ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్‌లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్‌.  

(చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్‌ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..)

 

#

Tags : 1

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు