Breaking News

'ఏక్లా నారీ శక్తి సంఘటన్‌'..! ఒంటరి సైన్యం

Published on Fri, 09/26/2025 - 09:31

పెళ్లైన రెండు సంవత్సరాలకే నిర్మల్‌ చందేల్‌ భర్త చనిపోయాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి చెందిన నిర్మల్‌కు ఒకవైపు తట్టుకోలేని దుఃఖం, మరోవైపు ఎన్నో ఆంక్షలు. నిర్మల్‌ అలంకరించుకోవడానికి లేదు. కొత్త దుస్తులు ధరించడానికి లేదు. బయటికి వెళ్లడానికి లేదు. ఉత్సవాలు, వేడుకలలో పాల్గొనడానికి లేదు. 

ఆంక్షల వల్ల తనలో విషాదం మరింత ఎక్కువ అయింది. కొంతకాలానికి ఆమె పుట్టింటికి వెళ్లింది. కాస్త ఉపశమనంగా అనిపించింది. సోలన్‌ జిల్లాలోని ఒక స్వచ్ఛంద సంస్థలో అకౌంటెంట్‌గా చేరింది. ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా ఉండేది. అక్కడ తనలాగే ఎంతోమంది ఒంటరి మహిళలు ఉంటున్నారు. వారు కూడా తనలాగే ఎన్నో బాధలు అనుభవించారు. 

చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఏక్లా నారీ శక్తి సంఘటన్‌ (ఇఎన్‌ఎస్‌ఎస్‌) అనే స్వచ్ఛంద సంస్థ హిమాచల్‌ప్రదేశ్‌ చాప్టర్‌కు ప్రాతినిధ్యం వహించడంతో నిర్మల్‌ జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఈ చాప్టర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 19,445 సభ్యులు ఉన్నారు. 1999లో 350 మంది ఒంటరి మహిళలతో జైపూర్‌లో ప్రారంభమైన ఏక్లా నారీ శక్తి సంఘటన్‌లో ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలలో 2,50,000 మంది మహిళలు ఉన్నారు. రాజస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో 1,02,000 మంది సభ్యులు ఉన్నారు. 

సభ్యులు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడేలా చేయడం నుంచి వారి ఆరోగ్య సంరక్షణ వరకు ఎన్నో విషయాలలో కృషి చేస్తోంది ఏక్లా నారీ శక్తి సంఘటన్‌. మన దేశంలో ఒంటరి మహిళల (సింగిల్‌ ఉమెన్‌) సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఒంటరి మహిళల సంఖ్య 2011లో 51.2 మిలియన్‌లు ఉండగా 2024కు 71.4 మిలియన్‌లకు చేరింది. 

(చదవండి: పేపర్‌ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్‌ రికార్డు..!)

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌